Begin typing your search above and press return to search.

ఆడియ‌న్స్ అభ్య‌ర్థ‌న‌ను వాళ్లు వింటారా?

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దురంధ‌ర్ సినిమాను డ‌బ్బింగ్ చేయాల‌ని ఆడియ‌న్స్ కోరుతున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ వారి రిక్వెస్ట్ ను ఆల‌కించి సినిమాను ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్బింగ్ చేస్తారా అనేది ప్ర‌శ్న‌గా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Dec 2025 3:00 AM IST
ఆడియ‌న్స్ అభ్య‌ర్థ‌న‌ను వాళ్లు వింటారా?
X

బాలీవుడ్ లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన దురంధ‌ర్ మూవీ శుక్ర‌వారం రిలీజై ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ మంచి థియేట్రిక‌ల్ ర‌న్ తో దూసుకెళ్తుంది. దురంధ‌ర్ సినిమా మంచి స‌క్సెస్ అయిన కార‌ణంగా చిత్ర యూనిట్ కు సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

దురంధ‌ర్ ను ప్ర‌శంసిస్తూ పోస్టులు

ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత దురంధ‌ర్ మూవీని ప్ర‌శంసిస్తూ బాలీవుడ్ లోని ప‌లువురు సెల‌బ్రిటీలు, న‌టీన‌టులు పోస్టులు పెట్ట‌గా, సినిమాను చూసి ఇష్ట‌ప‌డిన ఎంతోమంది చిత్ర యూనిట్ ను ఓ విష‌యంలో ఎంత‌గానో రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే సినిమాను సౌత్ లోని ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్ చేయాలని. దురంధ‌ర్ మూవీకి హిందీలో వ‌చ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆడియ‌న్స్ ఈ సినిమాను సౌత్ లాంగ్వేజెస్‌లోకి డ‌బ్ చేయాల‌ని కోరుతున్నారు.

ఏ మాత్రం ప్ర‌భావం చూపని ఛావా డ‌బ్బింగ్ వెర్ష‌న్

గ‌తంలో విక్కీ కౌశ‌ల్ న‌టించిన ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. ఛావా మూవీని హిందీతో పాటూ ఒకేసారి ఇత‌ర భాష‌ల్లో కూడా డ‌బ్ చేసి రిలీజ్ చేసి ఉంటే ఆ సినిమాకు ఇంకా మంచి క‌లెక్ష‌న్లు వ‌చ్చేవి. కానీ మేక‌ర్స్ ఛావాను హిందీలో రిలీజైన కొన్ని వారాల త‌ర్వాత మిగిలిన భాష‌ల్లో రిలీజ్ చేయ‌డంతో ఆ సినిమా డ‌బ్బింగ్ వెర్ష‌న్ పెద్దగా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దురంధ‌ర్ సినిమాను డ‌బ్బింగ్ చేయాల‌ని ఆడియ‌న్స్ కోరుతున్న‌ప్ప‌టికీ మేక‌ర్స్ వారి రిక్వెస్ట్ ను ఆల‌కించి సినిమాను ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్బింగ్ చేస్తారా అనేది ప్ర‌శ్న‌గా మారింది. పైగా సినిమాను డ‌బ్ చేస్తే అందులోని ఒరిజిన‌ల్ సోల్ కూడా దెబ్బ‌తిన‌డంతో పాటూ ఆల్రెడీ గ‌తంలో ఛావా విష‌యంలో జ‌రిగిన ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుని ఆడియ‌న్స్ అభ్య‌ర్థ‌నను మేక‌ర్స్ అంత‌గా సీరియ‌స్ గా తీసుకోరేమో అనిపిస్తుంది.