దుల్కర్ సినిమాలు.. అసలు స్పెషల్ క్వాలిటీ అదేనేమో..
హీరోగా ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత అదే ఫార్ములాను పట్టుకుని ముందుకెళ్లడం చాలా ఈజీ.
By: M Prashanth | 7 Sept 2026 1:00 PM ISTహీరోగా ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత అదే ఫార్ములాను పట్టుకుని ముందుకెళ్లడం చాలా ఈజీ. కానీ.. ప్రతిసారీ తనను తాను కొత్తగా చూపించాలనుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. దుల్కర్ సల్మాన్ కెరీ ర్‌ను గమనిస్తే ఇదే విషయం కనిపిస్తుంది. ప్రేక్షకులకు నచ్చిన ఇమేజ్ కాపాడుకోవడం కంటే.. దాన్ని పక్కనపెట్టి కొత్త పాత్రల్లో కనిపించేందుకు ఆయన ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఇదే ఆయన కెరీర్‌లో కనిపించని రిస్క్.. అదే సమయంలో అసలు స్పెషల్ క్వాలిటీ కూడా కావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
దుల్కర్ సినిమాల్లో పెద్దగా కనిపించని మరో విషయం.. సేఫ్ గేమ్. ఒక రోల్ హిట్ అయితే దాని చుట్టూనే తిరుగుతూ వరుస సినిమాలు చేయడం ఆయన స్టైల్ కాదు. ఒక సినిమాలో కనిపించిన లుక్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ షేడ్స్ ను మరో సినిమాలో మళ్లీ రిపీట్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. కథ మారితే.. పాత్ర మారుతుంది. పాత్ర మారితే.. తనను తాను ప్రెజెంట్ చేసే విధానం కూడా మారుతుంది. అదే దుల్కర్‌ను మిగతా హీరోల నుంచి కొంత ప్రత్యేకంగా నిలబెడుతోంది.
సాధారణంగా స్టార్ హీరో అంటే ఆడియన్స్ కు ఓ క్లియర్ ఇమేజ్ ఉంటుంది. ఆయన సినిమా అంటే ఇలాంటి కథే ఉంటుంది.. ఇలాంటి పాత్రలోనే కనిపిస్తారు అనే అంచనా ఉంటుంది. కానీ దుల్కర్ విషయంలో ఆ లెక్క అంత ఈజీగా పనిచేయదు. నెక్స్ట్ మూవీలో ఆయన ఏం చేయబోతున్నారు? ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? అనే క్యూరియాసిటీ ఉంటుంది. అదే ఆయనకు ఉన్న ప్రత్యేకమైన బలం.
అయితే ఇదే రిస్క్ కొన్నిసార్లు మైనస్ గా కూడా మారొచ్చు. ప్రతి ప్రయోగం ప్రేక్షకులను మెప్పించదు. ప్రతి కొత్త పాత్ర హిట్ అవ్వదు. ముఖ్యంగా ఒక స్టార్ హీరోగా మార్కెట్ పెరిగిన తర్వాత.. ప్రయోగాలకు వెళ్లడం అంటే అంచనాలతో ఆడుకోవడమే. అయినా దుల్కర్ పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా కొత్తదనం వైపు చూస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి.
దుల్కర్ కు హీరోయిజం కంటే క్యారెక్టర్ ముఖ్యం అనిపించే సందర్భాలు చాలానే ఉన్నాయి. భారీ ఎలివేషన్లు, ఫైట్లు, మాస్ డైలాగ్స్ లేకపోయినా.. ఒక పాత్రను తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నిలబెట్టగలగడం ఆయన బలంగా మారింది. ప్రేక్షకులు దుల్కర్‌ను కేవలం హీరోగా కాకుండా.. ఆ పాత్రలో దుల్కర్ ఎలా ఉంటాడనే యాంగిల్ లో చూడటం ఆయనకు ప్లస్. అందుకే దుల్కర్ చేస్తున్న రిస్క్ కాస్త డిఫరెంట్. ఆయన కొత్త కథలను మాత్రమే ఎంచుకోవడం కాదు.. ప్రతి సినిమాతో తన ఇమేజ్ కు కొత్త డిఫనేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అసలు సవాలూ ఇదే.
కొత్తగా కనిపించాలనే ప్రయత్నానికి.. ప్రేక్షకులను కట్టిపడేసే కథ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే తోడైతే రిస్కే కూడా ప్లస్ గా మారుతుంది. లేకపోతే అదే ప్రయోగాలు అంచనాలను అందుకోలేకపోవచ్చు. అయితే దుల్కర్ సినిమాల్లో కనిపించని రిస్క్.. తనను తాను రిపీట్ చేసుకోకపోవడమే. కానీ విచిత్రంగా.. ఇదే రిస్క్ ఆయన అసలు స్పెషల్ క్వాలిటీ కూడా కావచ్చు.
