Begin typing your search above and press return to search.

అతని బయోపిక్.. దుల్కర్ మాత్రమే ఎందుకంటే..?

సౌత్ సినిమాల్లో మమ్ముట్టి కొడుకుగానే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్.

By:  Ramesh Boddu   |   25 Nov 2025 11:21 AM IST
అతని బయోపిక్.. దుల్కర్ మాత్రమే ఎందుకంటే..?
X

సౌత్ సినిమాల్లో మమ్ముట్టి కొడుకుగానే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో స్టార్ గా కొనసాగుతున్న ఆయన తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొట్టేస్తున్నడు. మహానటిలో జెమిని గణేషన్ రోల్ లో మెప్పించిన దుల్కర్ నెక్స్ట్ సీతారామం తో సెన్సేషనల్ హిట్ అందుకోగా నెక్స్ట్ లక్కీ భాస్కర్ కూడా సక్సెస్ అందుకుంది. ఐతే రీసెంట్ గా వచ్చిన కాంత సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన కాంత ఆడియన్స్ ని రీచ్ అవ్వడంలో విఫలమైంది.

ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథతో..

ఐతే ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున దుల్కర్ నూతన దర్శకుడు రవితో మరో సినిమా లాక్ చేసుకున్నాడు. ఇవి రెండు కాకుండా ఒక క్రేజీ బయోపిక్ లో కూడా దుల్కర్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథతో సినిమా రాబోతుంది. 3 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన ఆనంద్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు.

ఐతే ఎంతోమంది స్టార్స్ ఉండగా విశ్వనాథన్ ఆనంద్ గా దుల్కర్ సల్మాన్ మాత్రమే ఎందుకు అంటే.. దుల్కర్ సినిమాలైతే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు.. కంటెంట్ బేస్డ్ సినిమాలకు అలాంటి అంచనాలు లేకపోవడమే సగం సక్సెస్ కి రీజన్ అవుతుంది. ఇక మరోపక్క దుల్కర్ వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్నాడు. అతనితో అయితే ఈ బయోపిక్ కి మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఎంచుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం..

దుల్కర్ నటించడం వల తెలుగు, తమిళ్ తో పాటు మిగతా సౌత్ లాంగ్వేజెస్ ఇంకా హిందీలో కూడా మార్కెట్ బాగుంటుందని తెలిసిందే. అందుకే విశ్వనాథ్ ఆనంద్ జీవిత కథకు తెర మీద ఆయన పాత్రలో దుల్కర్ ని ఫిక్స్ చేశారు. దుల్కర్ కూడా ఎంచుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. అక్కడ తెర మీద చేస్తున్న పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో దానికి 100 పర్సెంట్ అలా ఇచ్చిపడేస్తాడు. కాంత సినిమాలో కొన్ని సీన్స్ లో దుల్కర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. కానీ సినిమా ఆడియన్స్ కు రుచించలేదు.

ఫైనల్ గా విశ్వనాథన్ ఆనంద్ గా దుల్కర్ సల్మాన్ మరోసారి తన వర్సటాలిటీ చూపించాలని చూస్తున్నాడు. సౌత్ లో ఆల్రెడీ సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న దుల్కర్ కెరీర్ లో ఈ బయోపిక్ కూడా మరో సర్ ప్రైజ్ ప్రాజెక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో రీల్ విశ్వనాథన్ ఆనంద్ ఆడే ఆట ఎలా ఉంటుందో చూడాలి. క్రీడాకారుల జీవిత కథలు తెర మీద చూపించే ప్రయత్నం అంటే అది పెద్ద సాహసమే అని చెప్పాలి. ఐతే దుల్కర్ సల్మాన్ మాత్రం విశ్వనాథన్ ఆనంద్ పాత్రలో కనిపించేందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నట్టు తెలుస్తుంది.