తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోకస్ ఎందుకు?
తెలుగు మార్కెట్‌పై పరభాషా హీరోల ఆసక్తి పెరుగుతోంది. దుల్కర్ సల్మాన్ మలయాళంలో ఒక్కో సినిమాకు రూ.5-8 కోట్లు అందుకుంటుండగా, తెలుగులో రూ.15-18 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ విజయాలతో ఆయన మార్కెట్ పెరిగింది. రిషబ్ శెట్టి, శివకార్తికేయన్ కూడా టాలీవుడ్‌పై దృష్టి పెట్టడంతో తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా స్టార్లకు కీలక వేదికగా మారుతోంది.
By: Sivaji Kontham | 11 Nov 2026 9:27 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమ మార్కెట్ రేంజ్ గురించి ఇటీవల చాలా పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఫేమస్ అయితే ఇక్కడ పారితోషికాల రేంజ్, పాన్ ఇండియా గుర్తింపు కూడా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్ద ప్లస్ గా మారుతుంది. ఇరుగు పొరుగు నుంచి చాలా మంది హీరోలు ఎలాగైనా తెలుగు మార్కెట్ ని ఛేజిక్కించుకుని పాన్ ఇండియన్ అప్పీల్ ని తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. దీంతో పాటు పెద్ద పారితోషికాల్ని అందుకోవడానికి కూడా ఇది సహకరిస్తుందనేది ఆలోచన.
అయితే ఈ విషయంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తొలి నాళ్ల నుంచి కెరీర్ పరంగా చాలా తెలివిగా ప్లాన్ చేయడం తెలిసిందే. అతడు నటించిన ద్విభాషా చిత్రం `ఓకే బంగారం` తెలుగు, తమిళం రెండు చోట్లా పెద్ద విజయం సాధించింది. మలయాళంలో అతడు పెద్ద స్టార్ కాబట్టి, అక్కడ మార్కెట్ అతడికి బోనస్ గా కలిసొచ్చింది. తెలుగులో నటించిన స్ట్రెయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బంపర్ హిట్లు కొట్టడంతో అతడి ఇమేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాల విజయాలు అతడి పారితోషికం రేంజ్ పెరగడానికి కూడా కారణమయ్యాయి.
మలయాళంలో నిర్మించే సినిమాల బడ్జెట్ పరిమితులు.. మార్కెట్ పరిధి కంటే తెలుగులో లభించే అవకాశాలు, పారితోషికాలు చాలా విస్తృతమైనవి. అందుకే అతడు ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాలకు సంతకాలు చేస్తున్నాడు. ఆకాశంలో ఒక తార చిత్రంతో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోను తెలుగు ప్రాజెక్టుపై ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఇక దుల్కర్ మలయాళంలో ఒక్కో సినిమాకి 5-8 కోట్ల మధ్యలో ఆరితోషికం అందుకుంటాడు. అదే తెలుగులో ఒక సినిమాలో నటిస్తే అతడికి 15-18 కోట్ల రేంజులో పారితోషికాలు అందుతున్నాయి. ఇక్కడ తన సినిమాలకు మార్కెట్ పరిధి కూడా చాలా పెద్దది. కేవలం థియేట్రికల్ హక్కులే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోను భారీ మొత్తాలు అందుతున్నాయి. ఓటీటీ, శాటిలైట్, డబ్బింగ్ హక్కుల రూపంలో భారీ వ్యాపారం జరుగుతుండటంతో నిర్మాతలు కూడా పెద్ద మొత్తంలో చెల్లించేందుకు వెనుకాడటం లేదు.
ఇక దుల్కర్ నటించిన సినిమాలలో లక్కీ భాస్కర్ 100 కోట్లకు పైగా వసూలు చేసి తన మార్కెట్ స్టామినాను తెలియజేసింది. అలాగే మలయాళంలో నటించిన కురుప్ చిత్రం 112 కోట్లు వసూలు చేసింది. వీటితో పాటు దుల్కర్ నిర్మాతగా మారి రూపొందించిన లోక: చాప్టర్ 1-చంద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించి 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూడు సినిమాలతోను అతడి రేంజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాల విజయం పాన్ ఇండియాలో అతడి క్రేజ్ ను మరింత పెంచాయి. ఇక ఇదే హుషారులో అతడు మైత్రి మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, భారీ చిత్రాలలో నటించేందుకు సంతకాలు చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. దుల్కర్ సల్మాన్ `శ్రీ శ్రీ` అనే రోమాంటిక్ డ్రామాలో కూడా నటిస్తున్నారు. రవి నెలకూడితి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.
కేవలం దుల్కర్ సల్మాన్ మాత్రమే కాకుండా `కాంతార` చిత్రంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి కూడా టాలీవుడ్ వైపే చూస్తున్నారు. శివకార్తికేయన్ లాంటి తమిళ హీరో తెలుగు మార్కెట్ లో వెలిగిపోయేందుకు చాలా కసిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అటు బాలీవుడ్ స్టార్లు ఇటీవల బహుభాషా చిత్రాలతో తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ఇక్కడ విజయం సాధిస్తే..అది సహజంగానే హిందీ, తమిళ, కన్నడ భాషల్లోకి సులువుగా విస్తరించి పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతుంది. భారీగా థియేట్రికల్ రీచ్, పెద్ద బడ్జెట్లు.. అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపు కారణంగానే పరభాషా నటులు టాలీవుడ్‌ను తమ ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నారు.
