దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలెక్షన్ లో ఏం చూస్తాడో తెలుసా.? దానివల్లే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందా?
‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తున్నాడు. కమర్షియల్ ఇమేజ్ కంటే కథ, పాత్రలోని సంఘర్షణకు ప్రాధాన్యత ఇస్తూ విజయాలు అందుకుంటున్నాడు. తెలుగు హీరోలు ఇమేజ్‌కు సరిపోవని వదిలేసిన కథలతోనే దుల్కర్ సక్సెస్ సాధిస్తున్నాడనే చర్చ నడుస్తోంది. నటుడిగా ప్రయోగాలకు సిద్ధంగా ఉండటం, కథలను సరిగ్గా అంచనా వేయడమే ఆయన విజయానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Gopi Velupala | 16 Nov 2026 9:00 PM ISTమలయాళం ఇండస్ట్రీ లో కెరీర్ ను మొదలుపెట్టిన దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత చేసిన 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. 'లక్కీ భాస్కర్' తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
దుల్కర్ సల్మాన్ స్క్రిప్ట్ సెలెక్షన్
ఎలాంటి క్యారెక్టర్ లో అయిన నటించి మెప్పించే కెపాసిటీ ఉన్న నటుడు దుల్కర్ సల్మాన్... అందుకే తన దగ్గరికి వచ్చిన కథల విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే కథలో మెయిన్ స్టోరీ ఏంటి? అందులో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది. ఆ పాత్ర చేయడానికి తననుంటాను ఎలా మార్చుకోవాలి అనేది క్లారిటీ గా చూసుకుంటాడు. తను ఒక స్టోరీ సెలెక్ట్ చేశాడంటే అది ఆల్మోస్ట్ సక్సెస్ అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. కంటెంట్ బేస్డ్ కథలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
మిగతా వాళ్ళకి సాధ్యం కానిది ఆయనకేలా అవుతుంది...
మన తెలుగు హీరోలు రిజెక్ట్ చేసిన తరువాత నే ఆయన మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు చేశాడు. మన హీరోలకు ఆ కథల్లో కమర్షియాలిటీ మిస్ అయిందని అనిపించవచ్చు. అలాగే మన ప్రేక్షకుల మైండ్ సెట్ కి మనల్ని ఈ పాత్రలో చూడలేరమో అనుకోని ఉండొచ్చు. కానీ ఒక నటుడికి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే? కథలను పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు చేసే సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయి. కొంతమంది హీరోలకు ఆ కథల వాల్యూ తెలిసిన అవి వాళ్ల ఇమేజ్ కి సెట్ అవ్వని సినిమాలని వదిలేస్తున్నారు. ఫైనల్ గా పర భాష హీరోలు కంటెంట్ బేస్డ్ మూవీస్ చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు.
ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయారా?
నటుడికి ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదు. తను చేయలేని పాత్ర అనేది ఉండకూడదు. ప్రతి పాత్రలో తమ పోటెన్షియాలిటీ చూపించాలి. అంతే తప్ప కొన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యే సినిమాలు మాత్రమే చేస్తానని అనుకుంటే నటుడిగా పేరు సంపాదించుకునే అవకాశం రాదు. ఇలాగే అన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.
