ప్రశంసలే కాదు, లాభాల్లో వాటా కూడా
సినిమా నిర్మాణమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ నిర్మాత అయినా గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకం, ఆలోచనతోనే అందులోకి దిగుతారు
By: Sravani Lakshmi Srungarapu | 5 Sept 2025 5:00 PM ISTసినిమా నిర్మాణమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఏ నిర్మాత అయినా గొప్ప సినిమా చేస్తున్నామనే నమ్మకం, ఆలోచనతోనే అందులోకి దిగుతారు. కానీ కొన్నిసార్లు వారి ఆలోచనలు, నమ్మకాలు తప్పని నిరూపిస్తూ సినిమాలు ఫ్లాపులుగా నిలిస్తే, మరికొన్ని సార్లు మాత్రం ఊహించని విధంగా సినిమా బ్లాక్ బస్టర్ అయి నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి.
సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కూడా..
అయితే అలా వచ్చిన లాభాలు నిర్మాతలకే ఉంటాయి తప్పించి చిత్ర యూనిట్ కు అందులో ఎలాంటి షేర్ ఉండదు. కానీ మలయాళ నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ ఈ విషయంలో కొత్త మార్పు తీసుకొస్తున్నారు. దుల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మలయాళ ఇండస్ట్రీలోని సెన్సేషనల్ నటుల్లో ఆయన కూడా ఒకరు. దుల్కర్ కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తూ ఉంటారు.
భారీ లాభాలను అందుకున్న లోకా
ఆయనకు సినిమాపై ఉన్న అభిరుచి, అతన్ని మంచి సినిమాలు చేసేలా చేస్తుంది. దుల్కర్ బ్యానర్ నుంచి తాజాగా వచ్చిన లోకా: పార్ట్1- చంద్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా మంచి లాభాలను అందుకుంది. అయితే లోకా సక్సెస్ కేవలం తనది మాత్రమే కాదని, చిత్ర యూనిట్ లోని ప్రతీ ఒక్కరిదీ అని దుల్కర్ మొదటి నుంచి ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
చిత్ర యూనిట్ తో లాభాలను పంచుకుంటా
కేవలం ప్రశంసలతో ఆగకుండా సినిమా లాభాలను కూడా చిత్ర యూనిట్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నట్టు దుల్కర్ అనౌన్స్ చేశారు. సాధారణంగా నిర్మాతలెవరైనా సరే లాభాలొస్తే వాటిని చిత్ర యూనిట్ తో షేర్ చేసుకోరు. కానీ దుల్కర్ మాత్రం అందరికీ తన లాభాల్లో షేర్ ఇస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు. లోకా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి వర్క్ ఏశారని, సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ పై కనిపిస్తుందని, దానికి కారణం తన టీమ్ యే నని దుల్కర్ అన్నారు. కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే కాదని, లోకా నుంచి తర్వాత ఇచ్చే సినిమాల లాభాలను కూడా సక్సెస్ కు రీజన్ అయిన తన టీమ్ తో షేర్ చేసుకుంటానని దుల్కర్ ప్రకటించారు. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేసింది.
