పిరియాడిక్ లవ్ స్టోరీ.. హీరో ఒక్కడే..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సొంత భాషలో కెరీర్ ఎలా ఉందో కానీ తెలుగులో మాత్రం స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తున్నాడు.
By: Ramesh Boddu | 29 July 2025 5:00 AM ISTమలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సొంత భాషలో కెరీర్ ఎలా ఉందో కానీ తెలుగులో మాత్రం స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తున్నాడు. దుల్కర్ సినిమా అంటే చాలు తెలుగులో సూపర్ హిట్ అనే బలమైన సెంటిమెంట్ ఏర్పరచుకున్నాడు. మహానటిలో జెమిని గణేషన్ రోల్ కి దుల్కర్ ని చూసి మెచ్చిన తెలుగు ఆడియన్స్ వరుసగా అతని సినిమాలను ఆదరిస్తున్నారు. మహానటి తర్వాత సీతారామం, ఆ తర్వాత లక్కీ భాస్కర్ ఇలా వరుస హిట్లు పడ్డాయి.
మహానటి కోసం దుల్కర్..
ముఖ్యంగా వెరైటీ కథ అది కూడా పీరియాడికల్ మూవీ ఐతే దానికి దుల్కర్ ని తీసుకుంటున్నారు. మహానటిలో ఐతే జెమిని గణేశన్ కోసం దుల్కర్ ని తీసుకున్నారు. సీతారామంలో మాత్రం హను తెలుగు హీరో ఒకరిని అనుకున్నా అది సెట్ అవ్వక దుల్కర్ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక లక్కీ భాస్కర్ కూడా ఒకప్పటి కథలానే చెప్పారు.
ఐతే తెలుగు మేకర్స్ దుల్కర్ తో పీరియాడికల్ కథలే చేస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీస్, ఇంకా ఒకప్పటి కథలు ఐతే చాలు అది దుల్కర్ తోనే చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కాంత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీగానే వస్తుందట. ఈ మూవీలో రానా కూడా నటిస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.
పాపులారిటీతో కెరీర్ బిజీ..
దుల్కర్ టేకప్ చేశాడు కాబట్టి కచ్చితంగా సినిమా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. కాంత తో పాటు దుల్కర్ సొంత భాష మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. మొత్తానికి తెలుగులో దుల్కర్ కి వచ్చిన ఈ పాపులారిటీ అతని కెరీర్ ని బిజీ చేశాయి. ఎంతగా అంటే సొంత భాషలో సినిమా తీసే టైం లేకుండేలా చేశాయి.
దుల్కర్ రానున్న సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని అనిపిస్తుంది. కాంతా సినిమా భాగ్య శ్రీ కోసం ఇద్దరు హీరోల మధ్య ఫైట్ జరిగేలా ఉంది. దుల్కర్ కి ఈ సినిమా కూడా హిట్ పడితే ఇక అతని రేంజ్ వేరేలా ఉంటుంది. కాంత ఎలా ఉంటుంది.. దుల్కర్ మరోసారి ఎలాంటి కథతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు అన్నది చూడాలి. అతను హీరోగా అనుకుంటే చాలు పీరియాడికల్ మూవీనే అవుతుంది. అది అలా కావాలని జరగకపోయినా ఈ కోఇన్సిడెన్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
