Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ జోడీ.. సీక్వెల్ కాదు కానీ..?

ఐతే సూపర్ హిట్ కొట్టిన ఈ జంటతోనే మరో సినిమా చేయొచ్చు కదా అని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ మెసేజ్ లు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఓ పక్క తెలుగులో బిజీ హీరో అయ్యాడు.

By:  Ramesh Boddu   |   28 Jan 2026 11:59 AM IST
సూపర్ హిట్ జోడీ.. సీక్వెల్ కాదు కానీ..?
X

ఒక సూపర్ హిట్ సినిమాలో నటించిన జోడీ అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ ఇద్దరు కలిసి మరోసారి నటిస్తే చూడాలని కోరుకుంటారు. ఈమధ్య కాలంలో అలా ఇద్దరి కలిసి నటించాలని ఆడియన్స్ బాగా కోరుకున్నది మాత్రం సీతారామం జంట అనే చెప్పొచ్చు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో కలిసి హను రాఘవపూడి తెరకెక్కిన సీతారామం ప్రేక్షకుల మనసులు కదిలించేలా చేసింది. ముఖ్యంగా అప్పటివరకు బాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోని మృణాల్ ఠాకూర్ కి సీతారామం ఒక బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీలో కూడా మృణాల్ ఠాకూర్ బిజీ అయ్యింది.

దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ..

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరి జోడీ ఆ సినిమాకు మరింత హైలెట్ గా నిలిచింది. సీతారామం వచ్చి 4 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమాలో సాంగ్స్, కొన్ని సీన్స్ ప్రేక్షకులను వెంటాడుతున్నాయి. ఐతే సూపర్ హిట్ కొట్టిన ఈ జంటతోనే మరో సినిమా చేయొచ్చు కదా అని ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్ మెసేజ్ లు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఓ పక్క తెలుగులో బిజీ హీరో అయ్యాడు. ఇక్కడ వరుస సినిమాలతో దుల్కర్ సత్తా చాటుతున్నాడు.

మృణాల్ ఠాకూర్ తెలుగు కెరీర్ కాస్త స్లోగా ఉన్నా హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ్ లో కూడా ఒక మూవీ ఓకే చేసింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సీతారామం జంట అదే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి ఉన్న ఒక పోస్టర్ వైరల్ అయ్యింది. ఇద్దరు కలిసి ఏదో సినిమా చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో డిస్కషన్ జరుగుతుంది.

సల్మాన్, మృణాల్ సీతారామం 2..

రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ ఒక తెలుగు సినిమాకు సైన్ చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈలోగా దుల్కర్ తో కలిసి ఉన్న పోస్టర్ వైరల్ అయ్యింది. అది చూసిన ఆడియన్స్ మృణాల్ దుల్కర్ తో మరో సినిమా చేస్తుందని కన్ ఫర్మ్ అయ్యారు. ఐతే సీతారామం జంట ఆ సినిమా సీక్వెల్ చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.

ఐతే దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి ఇప్పుడప్పుడే సీతారామం 2 చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ హను ప్రభాస్ తో ఫౌజీ సినిమా బిజీలో ఉన్నాడు. వైజయంతి మూవీస్ కూడా సీతారామం 2 గురించి అసలు కాల్ తీసుకోలేదు. సో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు కాబట్టి దుల్కర్, మృణాల్ చేసేది సీతారామం సీక్వెల్ అయితే కాదు. ఐతే ఇద్దరు కలిసి చేస్తున్న కొత్త సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటైల్స్ ఎప్పుడు బయటకు వస్తాయన్నది చూడాలి.