Begin typing your search above and press return to search.

నిరాశలో దుల్క‌ర్ - మృణాల్ ఫ్యాన్స్!

వెండితెర‌పై కొన్ని పెయిర్స్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ను ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Feb 2026 6:03 PM IST
నిరాశలో దుల్క‌ర్ - మృణాల్ ఫ్యాన్స్!
X

వెండితెర‌పై కొన్ని పెయిర్స్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ ను ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేరు. వారు చేసిన సినిమాలు, వారి పాత్ర‌లు ఎప్ప‌టికీ మ‌న మ‌నసుల్లో ప‌దిల‌మైన చోటును ద‌క్కించుకుంటాయి. అలాంటి పెయిర్స్ లో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడీ కూడా ఒక‌టి. సీతారామం మూవీతో బెస్ట్ జోడీ అనిపించుకోవ‌డంతో పాటూ ఆ సినిమాలో రామ్, సీత‌గా అంద‌రి మ‌నసుల్ని గెలుచుకున్నారు దుల్క‌ర్, మృణాల్.

సీతారామంతో మంచి జోడీగా గుర్తింపు

సీతారామం చూశాక వారిద్ద‌రి జంట ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉందో అని అన‌ని వాళ్లు లేరంటే అతిశ‌యోక్తి లేదు. 2022లో హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేసింది లేదు. దుల్క‌ర్, మృణాల్ క‌లిసి మ‌ళ్లీ న‌టిస్తే బావుండ‌ని ఎంతో మంది అనుకున్నారు.

మ‌రోసారి క‌లిసి న‌టించిన దుల్క‌ర్, మృణాల్

అలా అనుకుంటున్న వారి కోస‌మే వారిద్ద‌రూ క‌లిసి మ‌రోసారి న‌టించారు. కొన్నాళ్ల కింద‌ట దుల్క‌ర్, మృణాల్ క‌లిసి ఉన్న పోస్టర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి రావ‌డంతో వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నార‌ని ఫ్యాన్స్ అందరూ ఎంతో సంతోషించి, ఎప్పుడెప్పుడు ఆ సినిమా వ‌స్తుందా అని ఎంతో ఎదురుచూశారు. అయితే ఈసారి వారిద్ద‌రూ క‌లిసి న‌టించింది సినిమాలో కాదు. ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ కోసమ‌ని ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది.

భిగీ భిగీ సాంగ్ లో న‌టించిన హిట్ పెయిర్

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ కంపోజ్ చేసిన భిగీ భిగీ అనే సాంగ్ లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఈ సాంగ్ ను రెహ‌మాన్ కొడుకు అమీన్ తో క‌లిసి జ‌స్లీన్ రాయ‌ల్ పాడారు. పాట‌లో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బావున్న‌ప్ప‌టికీ పాట మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేంత‌గా అయితే లేద‌ని నెటిజ‌న్లు ఇప్ప‌టికే ఈ సాంగ్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

సీతారామం సీక్వెల్ అని ఆశ‌ప‌డిన ఫ్యాన్స్

వాస్త‌వానికి దుల్క‌ర్, మృణాల్ కాంబినేష‌న్ లో సీతారామంకు సీక్వెల్ గా సినిమా వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు రావ‌డంతో రీసెంట్ గా వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న పోస్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు కూడా అంద‌రూ ఆ సీక్వెల్ రాబోతుందేమోన‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సాంగ్ మాత్రమే రావ‌డం, అది కూడా వావ్ అనిపించేలా లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్ అవుతున్నారు. ఇక సీతారామం సీక్వెల్ విష‌యానికొస్తే ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో ఫౌజీ సినిమా చేస్తూ హ‌ను రాఘ‌వ‌పూడి బిజీగా ఉంటే దుల్క‌ర్, మృణాల్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఎవ‌రి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండ‌టంతో ఈ సీక్వెల్ వ‌చ్చినా కాస్త టైమ్ ప‌ట్టే ఛాన్సుంది.