Begin typing your search above and press return to search.

దుల్కర్ సల్మాన్ కార్లు సీజ్.. ఏం జరిగిందంటే..

ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ మార్గాల్లో భూటాన్‌ నుంచి ఖరీదైన వాహనాలు దిగుమతి చేసుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులు మంగళవారం కేరళలో సోదాలు చేపట్టారు.

By:  M Prashanth   |   24 Sept 2025 3:26 PM IST
దుల్కర్ సల్మాన్ కార్లు సీజ్.. ఏం జరిగిందంటే..
X

ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ మార్గాల్లో భూటాన్‌ నుంచి ఖరీదైన వాహనాలు దిగుమతి చేసుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులు మంగళవారం కేరళలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో మలయాళ సెలబ్రిటీలు మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ నివాసాల్లో సహా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు దుల్కర్ కు చెందిన రెండు ఖరీదైన కార్లను సీజ్ చేశారు.

దుల్కర్‌ వద్ద స్వాధీనం చేసుకున్న వాటిలో ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌, టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ కార్లు ఉన్నాయి. ఇందులో ఒకటి కేరళ త్రిశ్శూర్‌ లో, మరొకటి తమిళనాడులో రిజిస్టర్‌ చేయించారు. కానీ, ఇవి దుల్కర్‌ పేరు మీద లేదు. ఇందులో దుల్కర్ థర్డ్ ఓనర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కారు అసలు ఓనర్ ఎవరన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. అంతేకాకుండా మరో రెండు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ఆయన ఈ వాహనాలు ఎవరి దగ్గర కొన్నారు. దానికి ఎవరు సహకరించారు. తదితర విషయాలపై విచారణ జరుపనున్నారు. అలాగే దుల్కర్‌ వద్ద ఉన్న కార్లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇతరత్రా డాక్యుమెంట్‌ లను సమర్పించాలని నటుడికి సమన్లు జారీ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దుల్కర్ తోపాటు ఇవే తనిఖీల్లో మరో నటుడు అమిత్ చక్కలకల్‌ ఇంట్లోనూ దాడులు చేశారు.

ఆయన నివాసంలో ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై నటుడు అమిత్ స్పందించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో తనది ఒక్క కారే అని, మిగిలినవి వేరేవారివి అని అన్నారు. కాగా, వీటితోపాటు తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజి కోడ్, మలప్పురంలలో అనేక బృందాలు దాడులు చేశాయి.

అయితే ఇలాంటి వాహనాలు హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేయించి.. వాటిని ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారట. ఒక్క కేరళలో ఇలాగే తప్పుడు పత్రాలు, అక్రమంగా దాదాపు మొత్తం 150 -200 వాహనాలు భారత్ కు తీసుకుచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే లగ్జరీ కార్ల షో రూమ్ లకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.