Begin typing your search above and press return to search.

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

నటుడు జగపతిబాబు టాక్ షోలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన భార్య అమల్ సూఫియాతో ప్రేమకథను పంచుకున్నారు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదివినా అప్పట్లో ప్రేమ లేదని తెలిపారు. కొన్నేళ్ల తర్వాత ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెరిగి, పుదుచ్చేరిలో తొలి డేట్‌కు వెళ్లినట్లు చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2011 డిసెంబర్ 22న వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   18 Nov 2026 12:54 PM IST
స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!
X

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెరపై తన నటనతో ఆకట్టుకునే దుల్కర్.. వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. తాజాగా నటుడు జగపతిబాబు నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న ఆయన తన భార్య అమల్ సూఫియాతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దుల్కర్, అమల్ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. అయితే స్కూల్ రోజుల్లో వారిద్దరి మధ్య ప్రేమ లేదు. అమల్ దుల్కర్ కంటే ఐదేళ్లు చిన్నది కావడంతో తనని చాలా చిన్న పిల్లలాగా చూశానని చెప్పుకొచ్చారు. మరోవైపు చాలా సంవత్సరాల తర్వాత దుల్కర్ చెన్నైలో ఉన్నప్పుడు దుల్కర్‌కు అమల్ అనుకోకుండా పలుమార్లు ఎదురయ్యారంట. దీంతో ఫేస్‌బుక్ ద్వారా అమల్‌కు మెసేజ్ పంపి మాట్లాడటం ప్రారంభించారు. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

వారి మొదటి డేట్ కూడా చాలా ప్రత్యేకంగా జరిగింది అని దుల్కర్ చెప్పారు. దుల్కర్ చెన్నై నుంచి అమల్‌ను కారులో పుదుచ్చేరికి తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారంట. ఒకరి ఆలోచనలు మరొకరు తెలుసుకున్నారు. ఆ పరిచయం తర్వాత ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడింది. దీంతో దుల్కర్ తన మనసులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పారంట. అమల్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపారంట. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో 2011 డిసెంబర్ 22న చెన్నైలో దుల్కర్, అమల్ వివాహం జరిగింది.

ఈ విషయాన్ని ఈ హీరో జగపతిబాబు షోలో పంచుకున్నారు. వీరికి 2017 ఏప్రిల్ 5న కుమార్తె.. అమీరా సల్మాన్ జన్మించారు. అమల్ తన జీవితంలోకి వచ్చిన తర్వాతే కెరీర్ కూడా మంచి మలుపు తిరిగిందని దుల్కర్ పలు సందర్భాల్లో చెప్పారు.