Begin typing your search above and press return to search.

కాంత ట్రైలర్ టాక్.. సినిమా నిజమైన రంగు చూపించేలా..!

కాంతా ట్రైలర్ లోనే దాదాపు కథ చెప్పేశాడు డైరెక్టర్. కానీ సినిమాలో దుల్కర్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది.

By:  Ramesh Boddu   |   6 Nov 2025 11:55 AM IST
కాంత ట్రైలర్ టాక్.. సినిమా నిజమైన రంగు చూపించేలా..!
X

దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కాంత. ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సముద్రఖని, రానా కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. మహానటి తర్వాత మరో సినిమా ప్రపంచానికి సంబందించిన కథతోనే వస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అదేంటో ఇలాంటి సినిమాలు ఈ హీరోకే పర్ఫెక్ట్ అనిపించేలా అతని ఇంపాక్ట్ ఉంటుంది. కాంతా సినిమా కూడా ఒక స్టార్ గా ఎదిగిన ఒక యాక్టర్ కథతో.. ఆయన జీవితంలో ఒక వ్యక్తి ఎంకరేజ్మెంట్.. ఆ టైం లోనే హీరోయిన్ ప్రేమ.. తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తితోనే వైరం ఇలా అన్ని అంశాలు ఉన్నాయి.





ట్రైలర్ లోనే దాదాపు కథ చెప్పేశాడు..

కాంతా ట్రైలర్ లోనే దాదాపు కథ చెప్పేశాడు డైరెక్టర్. కానీ సినిమాలో దుల్కర్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. అంతేకాదు హీరోయిన్ భాగ్య శ్రీ సినిమాలో కూడా హీరోయిన్ రోల్ చేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. ఓల్డ్ హీరోయిన్ గా భాగ్య శ్రీ లుక్స్ బాగున్నాయి. ఇక సముద్రఖని రోల్ చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో స్పెషల్ గా పోలీస్ ఆఫీసర్ గా రానా సర్ ప్రైజ్ ఇచ్చాడు.

కాంతా సినిమాలో రానా ఉన్నాడన్న విషయం తెలుసు కానీ ఇప్పటివరకు రానాకు సంబంధించిన ప్రమోషనల్ అప్డేట్స్ రాలేదు. ఐతే లేటెస్ట్ గా ట్రైలర్ లో రానాని రివీల్ చేశారు. స్క్రీన్ మీద రానాని చూసి కూడా దాదాపు 3 ఏళ్లు అవుతుంది కాబట్టి రానా కూడా తన రోల్ లో సూపర్ అనిపించేలా ఉన్నాడు. ట్రైలర్ ఐతే ఆడియన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసింది. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ మరోసారి పీరియాడికల్ సినిమా కథతో వస్తున్నారు.

సినిమా ఇచ్చే డబ్బు పేరు నిన్ను మార్చేశాయి..

ముఖ్యంగా సినిమా ఇచ్చే డబ్బు పేరు నిన్ను మార్చేశాయి అనే డైలాగ్ నిజమైన సినిమా రంగుని చూపించేలా ఉన్నాయి. నవంబర్ 14న కాంతా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో దుల్కర్, భాగ్య శ్రీ తో పాటుగా రానా రోల్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించేలా ఉంది. ట్రైలర్ హైలెట్స్ లో రానా క్లిప్స్ అదిరిపోయాయి. మరి దుల్కర్ సల్మాన్ కాంతా అటెంప్ట్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుంది అన్నది చూడాలి.

తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నిస్తూ సక్సెస్ అందుకుంటున్న దుల్కర్ కాంతాతో కూడా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ట్రైలర్ ఐతే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.