దుల్కర్ 'పసి మనసే'.. వింటేజ్ స్టైల్ లో ఇలా..
రీసెంట్ గా మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందులో దుల్కర్ వింటేజ్ లుక్ లో అద్భుతంగా కనిపించి అంచనాలను పెంచారు.
By: M Prashanth | 9 Aug 2025 6:13 PM ISTమాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తన స్క్రిప్ట్ ఎంపికలు, నటనతో ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు కాంత మూవీతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతోంది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఉండనుంది. దక్షిణ భారత సినిమా ప్రారంభ రోజులకు నివాళిగా రూపొందుతోంది. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
రీసెంట్ గా మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందులో దుల్కర్ వింటేజ్ లుక్ లో అద్భుతంగా కనిపించి అంచనాలను పెంచారు. ఇప్పుడు పసి మనసే సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యూజిక్ లవర్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటోంది.
ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్ కే పాడిన ఆ సాంగ్ కు కృష్ఱకాంత్ సాహిత్యం అందించారు. జాను చంతూర్ సంగీతం అందించారు. ఆయన కాంపోజిషన్ చాలా కొత్తగా.. వినడానికి వినూత్నంగా ఉందనే చెప్పాలి. ప్రదీప్ కుమార్, ప్రియాంక తమ గాత్రంతో ప్రాణం పోశారు. కృష్ణకాంత్ లిరిక్స్ కూడా బాగున్నాయి.
అయితే సాంగ్ లో దుల్కర్ సల్మాన్ మరోసారి వింటేజ్ లుక్ లో అద్భుతంగా ఉన్నారు . ఆయన తన స్టైల్ లో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఎరుపు రంగు లాంగ్ గౌనులో భాగ్యశ్రీ బోర్సే మెప్పించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. మొత్తనికి సాంగ్.. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
