ఒకానొక టైమ్ లో కాంతను వదిలేద్దామనుకున్నా.. కానీ!
అయితే కాంత సినిమా పూర్తవడానికి వచ్చిన ప్రధాన సమస్య మెయిన్ క్యాస్టింగ్ కాల్షీట్స్. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించగా రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించారు.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 7:06 PM ISTఇండస్ట్రీలో అన్ని సినిమాలూ ఒకే టైమ్ లో పూర్తవలేవు. కొన్ని సినిమాలు చాలా వేగంగా పూర్తైతే మరికొన్ని సినిమాలు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. స్క్రిప్ట్, కాల్షీట్స్, క్లారిటీ వల్ల సినిమాలు ఫాస్ట్ గా పూర్తైతే, సినిమాలు లేటవడానికి మాత్రం ఎన్నో కారణాలుంటాయి. అసలు కొన్ని సినిమాలైతే ఈ సినిమా పూర్తై రిలీజవుతుందా అని అందులో నటించే వాళ్లకు సైతం అనిపిస్తూ ఉంటుంది.
ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో మొదలైన కాంత
దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కిన కాంత సినిమా విషయంలో కూడా ఇంచుమించు తనకు ఇలానే అనిపించిందంటున్నారు హీరో కమ్ ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్. కాంత సినిమా ఎనిమిదేళ్ల ముందుగానే ఎంతో ఎగ్జైట్‌మెంట్ తో మొదలైందని, కానీ అది ఆఖరికి ఎన్నో కష్టాలు, ఆలస్యాల తర్వాత నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని దుల్కర్ తెలిపారు.
కాల్షీట్స్ లేకనే ఆలస్యం
అయితే కాంత సినిమా పూర్తవడానికి వచ్చిన ప్రధాన సమస్య మెయిన్ క్యాస్టింగ్ కాల్షీట్స్. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించగా రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ ఇద్దరూ వేరే ప్రాజెక్టులతో రెగ్యులర్ గా బిజీగా ఉండటం వల్ల కాంత సినిమాకు డేట్స్ అడ్జస్ట్ అవలేదని, అందుకే కాంత బాగా లేటైందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దుల్కర్.
ఎప్పటికీ పూర్తవదనుకున్నా
వాస్తవానికి కాంత, లక్కీ భాస్కర్ సినిమాలను ఒకేసారి చేయాలనుకున్నానని, దాని కోసం రెండు సినిమాల డైరెక్లర్టు ఒకే రూమ్ లో ఉండి ఆయా సినిమాల్లోని లుక్స్ పై డిస్కషన్స్ కూడా చేసుకున్నారని, కానీ ఎన్ని అనుకున్నా అవేవీ జరగలేదని, లక్కీ భాస్కర్ సినిమా పూర్తైనా కాంత సినిమా స్టార్ట్ అవకపోవడంతో తన ఓపిక మొత్తం అయిపోయిందని, ఇక ఈ సినిమా అసలు ఎప్పటికీ జరగదనుకున్నట్టు దుల్కర్ చెప్పుకొచ్చారు.
ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావడానికి వేరే ప్రాజెక్టులను సెట్ చేసుకుని బిజీ అయిపోయానని, తర్వాత నిర్మాతగా రానాకు తనకు మధ్య చిన్న గొడవ లాంటిది కూడా జరిగిందని, అయితే ఆ గొడవేమీ పెద్దది కాదని, డేట్స్ గురించి, సినిమా లేటవడం గురించి ఒక నిర్మాతగా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. అవన్నీ జరిగాక ఒక్క క్షణం ఆ సినిమాను వదిలేద్దామా అనే ఆలోచన కూడా వచ్చిందని, కానీ కాంత మూవీలోని క్యారెక్టర్ తో తనకు ఓ బాండింగ్ ఏర్పడిందని, అందుకే దాన్ని వదులుకోలేకపోయానని చెప్పారు. ఇవన్నీ చూశాక కొన్ని మంచి సినిమాలు రావాలంటే ఎన్నో తిప్పలు పడాల్సిందేనని తనకు అర్థమైనట్టు దుల్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
