కాంతపై ఆడియన్స్ రియాక్షన్ ఏంటి..?
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్య శ్రీ బోర్స్ ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కాంత. ఈ సినిమాలో రానా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేశారు.
By: Ramesh Boddu | 15 Nov 2025 5:03 PM ISTదుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్య శ్రీ బోర్స్ ప్రధాన పాత్రల్లో సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కాంత. ఈ సినిమాలో రానా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటించడమే కాదు సంయుక్తంగా నిర్మించిన సినిమా కాంత. ఐతే ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఒక సినీ నేపథ్యం ఉన్న కథ.. అది కూడా 60ల కాలం నాటి కథతో ఈ సినిమా వచ్చింది.
సినిమా సక్సెస్ ఇచ్చే హెడ్ వెయిట్..
సినిమా దాని చుట్టూ ఉండే పరిస్థితులు.. అవమానాలు.. అవకాశాలు.. ఫైనల్ గా సక్సెస్ ఇచ్చే హెడ్ వెయిట్.. ఇలా గురు శిష్యుల మధ్య జరిగే ఈగోయిస్టిక్ వార్ తోనే కాంత సినిమా వచ్చింది. ఐతే సినిమా చూసిన ఆడియన్స్ అది కూడా క్రిటికల్లీ ఎక్లైండ్ ఆడియన్స్ కు సినిమా నచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర అతని ఎమోషన్ ని అర్ధం చేసుకున్న వారికే సినిమా ఎక్కుతుంది.
సినిమా అంతా దాదాపు రెండు ప్రధాన పాత్రలు ఒకటి దుల్కర్ రెండోది సముద్రఖని పాత్రలోనే సాగుతుంది. అది కూడా రెగ్యులర్ సినీ లవర్స్ కి కాస్త బోర్ కొట్టించే అంశమే అని అంటున్నారు. భాగ్య శ్రీ కూడా సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. పాత తరం నటీమణిలా భాగ్య తీసుకున్న కేర్ ని ప్రశంసిస్తున్నారు.
కాంత సినిమా పీరియాడికల్ కథ.. అది కూడా సినీ ప్రపంచానికి సంబందించిన కథ. ఐతే ఈ సినిమాకు అందరు ఆడియన్స్ కనెక్ట్ అవుతారని చెప్పడం కష్టమనేలా ఆడియన్స్ రియాక్షన్ ఉంది. సినిమా మొత్తం దుల్కర్ యాక్టింగ్ మీదే.. అతని నటనా ప్రతిభ మీదే నడిపించారు. ఆ విషయంలో దుల్కర్ ది బెస్ట్ అనిపించేశాడు. ఇప్పటివరకు దుల్కర్ చేసిన సినిమాలన్నిటిలో ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఎందులో చూడలేదని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.
కమర్షియల్ యాస్పెక్ట్స్, రెగ్యులర్ సినిమాటిక్ స్టఫ్ లాంటివి లేకపోయినా..
ఈ టైప్ సినిమాలు ఎక్కువ ఆడియన్స్ మెప్పు పొందే ఛాన్స్ లేకపోయినా ఎవరైతే సినిమా చూసి అందులోని పెర్ఫారెన్స్ లను సూపర్ అనేస్తారో అలాంటి వారికి సినిమా నచ్చుతుంది. కమర్షియల్ యాస్పెక్ట్స్, రెగ్యులర్ సినిమాటిక్ స్టఫ్ లాంటివి లేకపోయినా.. డిఫరెంట్ సినిమాలు చూడాలి.. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ అవ్వాలని చూసే వాళ్లకి ఇది నచ్చుతుందని సోషల్ మీడియాలో డిస్కస్ చేయడం చూస్తే సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయినట్టే అనిపిస్తుంది.
డైరెక్టర్ సినిమా పరంగా బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ కమర్షియల్ గా ఆడియన్స్ కోరుకునే అంశాలు లేవు.. అయినా సరే తన స్టోరీ టెల్లింగ్ తో సినిమాను కన్విన్స్ చేసేలా చేస్తాడు డైరెక్టర్. ఐతే మరి ఇలాంటి సినిమాకు ఆడియన్స్ సినిమాకు కమర్షియల్ గా కూడా సక్సెస్ అందిస్తారా లేదా అన్నది చూడాలి. ఫస్ట్ డే రెస్పాన్స్ అయితే యావరేజ్ గా ఉంది. కథ, కథనం సినిమా పరంగా వర్క్ అవుట్ అయ్యాయి. ఐతే అది ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అయ్యాయి అన్నది వీకెండ్ వరకు చూస్తే అసలు ఫలితం తేలుతుంది.
