Begin typing your search above and press return to search.

గన్ పట్టి గేమ్ మొదలుపెట్టిన దుల్కర్!

ఆ ప్లాప్ తాలూకు జ్ఞాపకాలను చెరిపేసేలా, సడెన్ గా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వదిలి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

By:  M Prashanth   |   29 Nov 2025 7:54 PM IST
గన్ పట్టి గేమ్ మొదలుపెట్టిన దుల్కర్!
X

సినీ ఇండస్ట్రీలో గెలుపు ఓటములు సహజం. ఒక శుక్రవారం బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో, మరో శుక్రవారం డిజాస్టర్ చూడొచ్చు. కానీ అసలైన స్టార్ లక్షణం ఎక్కడ బయటపడుతుందంటే.. పడినప్పుడు ఎంత వేగంగా లేచాడు అనే దగ్గరే. రీసెంట్ గా ఒక భారీ పరాజయాన్ని చూసిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటుడు ఇప్పుడు అదే చేసి చూపించాడు. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా, బాక్సాఫీస్ కు ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడు.




సాధారణంగా ఒక సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుని, అది తేడా కొడితే హీరోలు కాస్త గ్యాప్ తీసుకుంటారు. ఏ కథ ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ ఈ హీరో మాత్రం ఆ మూడ్ లో అస్సలు లేడు. ఆ ప్లాప్ తాలూకు జ్ఞాపకాలను చెరిపేసేలా, సడెన్ గా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వదిలి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది, ఈసారి లెక్క పక్కాగా ఉండబోతోందని.

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా "ఐ యామ్ గేమ్" ఫస్ట్ లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో దుల్కర్ లుక్ చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. ఒక ఎర్రటి సోఫాలో, స్టైలిష్ సూట్ వేసుకుని, చేతిలో గన్ పట్టుకుని కూర్చున్న తీరు మాస్ గా ఉంది. చేతికి ఉన్న రక్తం మరకలు, చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే ఇదొక హై క్రైమ్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తోంది.

నిజానికి దుల్కర్ ఎంతో ఇష్టంగా తీసిన 'కాంత' సినిమా ఫలితం ఆయన్ను తీవ్రంగా నిరాశపరిచింది. 1950ల నాటి క్లాసిక్ డ్రామాగా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. క్లాస్ ప్రయత్నం బెడిసికొట్టడంతో, ఇప్పుడు దుల్కర్ గేర్ మార్చి ఫుల్ మాస్ మోడ్ లోకి వచ్చేశాడు. పాత గాయానికి మందు.. ఈ కొత్త గన్ అని చెప్పకనే చెప్పాడు.

ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ దుల్కర్ ఇచ్చిన చిన్న క్యాప్షన్ ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. సినిమా కథేంటి, డైరెక్టర్ ఎవరు అనే వివరాల కంటే.. దుల్కర్ చూపించిన ఆ ఆటిట్యూడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సైలెంట్ గా ఉండటం తనవల్ల కాదని, గేమ్ ఆడటం ఇప్పుడే మొదలైందని ఈ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

ఏదేమైనా దుల్కర్ సల్మాన్ అంటేనే వెర్సటైల్ యాక్టర్. 'కాంత' మిగిల్చిన చేదు అనుభవం నుంచి ఇంత త్వరగా బయటపడి, ఇలాంటి రగ్గడ్ లుక్ తో రావడం నిజంగా గ్రేట్. ఈ 'గేమ్' కచ్చితంగా దుల్కర్ కు ఒక సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని, బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ ఆయన జెండా ఎగురుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.