Begin typing your search above and press return to search.

దుల్కర్ 'ఐమ్ గేమ్'.. ట్రైలర్ ఎలా ఉందంటే?

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఐమ్ గేమ్ విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.

By:  M Prashanth   |   30 July 2026 11:39 PM IST
దుల్కర్ ఐమ్ గేమ్.. ట్రైలర్ ఎలా ఉందంటే?
X

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఐమ్ గేమ్ విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. స్టైలిష్ విజువల్స్, హైవోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ ఛేజ్ సీన్స్ తో రూపొందిన ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది సాధారణ కమర్షియల్ యాక్షన్ సినిమా కాదని, స్టైల్‌ తో పాటు థ్రిల్‌ కు పెద్దపీట వేసిన యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిందనే క్లియర్ గా తెలుస్తోంది.

ట్రైలర్‌ లో దుల్కర్ సల్మాన్ పూర్తిగా కొత్త అవతార్‌ లో కనిపించాడు. అల్ట్రా స్టైలిష్ లుక్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్‌ తో తన పాత్రను మరింత ప్రత్యేకంగా మలిచాడు. ఓ గ్యాంబ్లర్ రోల్ లో కనిపిస్తున్న దుల్కర్, యాక్షన్‌ తో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్‌ ను కూడా ఈక్వల్ గా చూపించనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఆ ట్రైలర్‌ ను తెలుగు ప్రేక్షకుల కోసం జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయడం విశేషం. ట్రైలర్‌ లో కనిపించిన విజువల్ గ్రాండియర్, స్పీడ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్ డిజైనింగ్ పై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌ ను హై క్వాలిటీతో రూపొందించిన తీరు మూవీ టీమ్ తీసుకున్న కేర్ ను రిఫ్లైక్ట్ చేస్తోంది. దర్శకుడు నహాస్ హిదాయత్ మరోసారి తన స్టైలిష్ మేకింగ్‌ ను చూపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

గతంలో యాక్షన్ చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, ఈసారి మరింత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సౌత్ ఇండియాలో 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరణ జరపడం వల్ల సినిమాకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. భారీ కాన్వాస్‌ పై రూపొందిన యాక్షన్ బ్లాక్‌ లు, ఛేజ్ సీక్వెన్స్‌ లు ఆ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశముంది.

టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ట్రైలర్‌ కు పెద్ద బలంగా నిలిచింది. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కు మరింత ఉత్కంఠను జోడించింది. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ మూవీకి ఇంటర్నేషనల్ రేంజ్ లో విజువల్ ఫినిషింగ్‌ ను తీసుకొచ్చింది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా హాలీవుడ్ స్టైల్ ను గుర్తు చేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆంటోని వర్గీస్, మైస్కిన్, కథిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ చిత్రాన్ని నిర్మించారు. అలా ఐమ్ గేమ్ ట్రైలర్ స్టైల్, యాక్షన్, థ్రిల్ అన్నీ ఈక్వల్ లో ఉండే పాన్ ఇండియా ఎంటర్టైనర్‌ కు నాంది పలికింది. ఆగస్టు 20న ఓనం సందర్భంగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.