మహానటిలో ఆమె.. కాంతలో అతను..?
ఐతే కాంత సినిమా ట్రైలర్ చూస్తే ఒక గురువు సాయంతో స్టార్ గా ఎదిగిన ఒక నటుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారని అనిపిస్తుంది.
By: Ramesh Boddu | 9 Nov 2025 12:11 PM ISTదుల్కర్ సల్మాన్ కాంత సినిమా ట్రైలర్ చూశాక ఈ సినిమా మహానటికి దగ్గర పోలికలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అఫ్కోర్స్ రెండు సినిమాల కథ వేరు.. కానీ రెండు సినిమాలకు ఎంచుకున్న నేపథ్యం ఒకటే.. మహానటి సావిత్రి జీవిత కథతో ఆమె సినిమాల్లోకి రావడం స్టార్ గా ఎదగడం.. జెమినీ గణేషన్ తో ప్రేమ ఆ తర్వాత వివాహం ఆమె డౌన్ ఫాల్ ఇక చివరికి ఆమె మరణం ఇలా అన్నీ కూడా మహానటిలో ఎంతో హృద్యంగా చూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అసలు సినిమా చూసిన ప్రతి ఆడియన్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. అందుకే ఆ సినిమాకు కీర్తి సురేష్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది.
దుల్కర్ సల్మాన్ యాక్టింగ్..
ఐతే కాంత సినిమా ట్రైలర్ చూస్తే ఒక గురువు సాయంతో స్టార్ గా ఎదిగిన ఒక నటుడి జీవితం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారని అనిపిస్తుంది. ఐతే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ట్రైలర్ లోనే ఇంప్రెస్ చేసింది. సినిమా తెచ్చే పేరు, మార్పు గురించి సముద్రఖని ఒక డైలాగ్ లో చెబుతాడు. ట్రైలర్ లో ఆ డైలాగ్ లానే దుల్కర్ సల్మాన్ తనలోని వేరియేషన్స్ ని చూపించేలా ఉన్నాడు.
తప్పకుండా కాంతా సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కి అందరు ఫిదా అవుతారని అంటున్నారు. అవార్డ్ విన్నింగ్ అంటే కంపిటీషన్ చాలా ఉంది కానీ కచ్చితంగా ఇప్పటివరకు దుల్కర్ చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. నవంబర్ 14న దుల్కర్ సల్మాన్ కాంత వస్తుంది. టైటిల్ కాంత అని పెట్టినా సరే ఆట ఆడించేది మాత్రం దుల్కర్ సల్మాన్ అని తెలుస్తుంది.
సినిమాలో మరో స్టార్ రానా..
ఈ సినిమాలో కాంతగా భాగ్య శ్రీ బోర్స్ నటించింది. ఆమె కూడా లుక్స్ పరంగా ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలో మరో స్టార్ రానా కూడా ఉన్నాడు. అతను కూడా ఈ సినిమాలో సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. దుల్కర్, భాగ్య శ్రీ, రానా తో పాటు ఈ సినిమాలో మరో హైలెట్ గా నిలిచే రోల్ సముద్రఖని చేస్తున్నారు. సో ఈ నాలుగు పాత్రలు నాలుగు స్థంభాళ్లా నిలబడి కాంతా సినిమాను నిలబెడతాయని అంటున్నారు.
మహానటిలో ఆమె నటన చూసి ఎలా అయితే సర్ ప్రైజ్ అయ్యారో కాంతాలో అతను అదే మన దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చూసి ఆడియన్స్ షేక్ అయిపోతారని అంటున్నారు. మమ్ముట్టి నట వారసత్వాన్ని దుల్కర్ సినిమా సినిమాకు పెంచుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమా తీస్తే అది సూపర్ హిట్టే అనే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. తప్పకుండా అతని నుంచి వస్తున్న ఈ కాంత కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు.
