Begin typing your search above and press return to search.

గ్లింప్స్‌తో మొదలైన మ్యాజిక్.. ఫ‌స్ట్ సింగిల్ తో నెక్ట్స్ లెవెల్‌కు

ఒక సినిమా గురించి ఆడియ‌న్స్ లో ఇంట్రెస్ట్ పెంచాలంటే కేవలం భారీ యాక్షన్ సీన్స్ లేదా స్టార్‌డమ్ మాత్రమే సరిపోదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   28 July 2026 9:36 PM IST
గ్లింప్స్‌తో మొదలైన మ్యాజిక్.. ఫ‌స్ట్ సింగిల్ తో నెక్ట్స్ లెవెల్‌కు
X

ఒక సినిమా గురించి ఆడియ‌న్స్ లో ఇంట్రెస్ట్ పెంచాలంటే కేవలం భారీ యాక్షన్ సీన్స్ లేదా స్టార్‌డమ్ మాత్రమే సరిపోదు. కథలోని ఎమోష‌న్స్ ను ఆడియ‌న్స్ కు ముందుగానే పరిచయం చేస్తే ఆ సినిమాపై సహజంగానే ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న‌ ఆకాశంలో ఒక తార ప్రమోషన్లను పరిశీలిస్తే డైరెక్ట‌ర్ పవన్ సాధినేని కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సినిమా నుంచి మొదట రిలీజైన‌ గ్లింప్స్‌తో సినిమా విజువల్ టోన్, కథలో ఉండబోయే ఎమోషనల్ వ‌ర‌ల్డ్ పై చిన్న హింట్ ఇచ్చిన చిత్రబృందం, ఇప్పుడు తాజాగా దుల్క‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్ ద్వారా ఆ వ‌ర‌ల్డ్ ను మరింత దగ్గరగా పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒక సినిమా ప్రమోషన్‌లో ప్రతి అప్డేట్ కథను మొత్తం బయటపెట్టకుండా, దాని భావాన్ని మాత్రమే ఆడియ‌న్స్ వరకు తీసుకెళ్లడం ప్రస్తుతం అనేక మంది డైరెక్ట‌ర్లు అనుసరిస్తున్న ట్రెండ్. ఆకాశంలో ఒక తార కూడా అదే దారిలో ముందుకు వెళ్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పవన్ సాధినేని గతంలో తెరకెక్కించిన సినిమాల్లో కూడా క్యారెక్ట‌ర్ల ఎమోష‌న్స్ కు, వాటి మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యం కనిపించింది. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తూ, క్యారెక్ట‌ర్ల జ‌ర్నీని నెమ్మదిగా ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా ప్రమోషనల్ ప్లాన్ ను రూపొందించినట్లు కనిపిస్తోంది. ఒక గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించి, తర్వాత సాంగ్ ద్వారా కథలోని భావాలను పరిచయం చేయడం ఆ స్ట్రాట‌జీలో భాగంగా భావించవచ్చు. ఇటీవల సినిమాల ప్రచారంలో ఒక్కో కంటెంట్‌ను ఒక్కో ఎమోష‌న్ కు ప్రతీకగా రిలీజ్ చేసే విధానం బాగా పెరిగింది. దీంతో ఆడియ‌న్స్ ప్రతి అప్డేట్‌ను విడివిడిగా ఆస్వాదించడమే కాకుండా, సినిమా గురించి తమలో తామే ఒక అంచనాను నిర్మించుకుంటారు. ఆకాశంలో ఒక తార ప్రమోషన్స్ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్లింప్స్‌తో మొద‌లైన ఇంట్రెస్ట్, ఇప్పుడు సాంగ్ తో మరింత బలపడ‌నుంద‌ని సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్క‌ష‌న్స్ సూచిస్తున్నాయి.

స్పెష‌ల్ గా ఫ్యామిలీ ఆడియ‌న్స్, యూత్ , ఎమోష‌న‌ల్ క‌థ‌ల‌ను ఇష్టపడే సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రమోషనల్ కంటెంట్ రూపొందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కథను ముందే చెప్పకుండా, దాని సోల్ ను మాత్రమే పరిచయం చేయడం ద్వారా ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీని నిలబెట్టడం డైరెక్ట‌ర్ మెయిన్ టార్గెట్ గా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ఒకే ఎమోష‌న‌ల్ లైన్ ను కొన‌సాగిస్తుండ‌టం విశేషం. అదే కంటిన్యూ అయితే ఆకాశంలో ఒక తార ఆడియ‌న్స్ అంచనాలను మరింత పెంచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేసే నెక్ట్స్ అప్డేట్ ఆ ఇంట్రెస్ట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందా లేదా అనేది చూడాలి.