కాంత భాగ్య శ్రీ.. కీర్తిని గుర్తు చేస్తుందా..?
ఒకవేళ నేపథ్యం.. నటించే యాక్టర్స్ ఒకరే అవ్వడం వల్ల అలా అనిపిస్తుందేమో కానీ.. కథలు వేరుగా ఉంటే మాత్రం పాత్రలు ఒకేలా ఉండటం కుదరదు
By: Ramesh Boddu | 30 July 2025 4:00 AM ISTవేరు వేరు కథలు ఉన్నా కొన్నిసార్లు ఆ సినిమాల్లోని పాత్రలు ఒకేరకంగా అనిపిస్తాయి. ఒకవేళ నేపథ్యం.. నటించే యాక్టర్స్ ఒకరే అవ్వడం వల్ల అలా అనిపిస్తుందేమో కానీ.. కథలు వేరుగా ఉంటే మాత్రం పాత్రలు ఒకేలా ఉండటం కుదరదు. కానీ అదేంటో దుల్కర్ సల్మాన్ చేసిన ఒక సూపర్ హిట్ సినిమాకు.. రాబోతున్న మరో మూవీకి కాస్త దగ్గర పోలిక ఉన్నట్టు ఉంది.
దుల్కర్ సల్మాన్ తెలుగు ఎంట్రీ..
దుల్కర్ సల్మాన్ తెలుగు ఎంట్రీ ఇచ్చిన సినిమా మహానటి. అందులో జెమ్ని గణేశన్ పాత్రలో ఇంప్రెస్ చేశాడు. అందులో హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ని ఇష్టపడతాడు. అఫ్కోర్స్ అది సావిత్రి గారి కథతో తెరకెక్కిన సినిమా కాబట్టి అలా తీశారు. అందులో సినిమాలో సినిమా హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించింది. ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేస్తున్న కాంత సినిమాలో కూడా మరోసారి అదే రిపీట్ అవుతుంది.
దుల్కర్ సల్మాన్ కాంత సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది. ఈమె కూడా కాంత లో ఒక హీరోయిన్ పాత్రనే చేస్తుంది. అంటే సినిమాలో సినిమా హీరోయిన్ అన్నమాట. ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ మహానటి కీర్తి సురేష్, కాంత భాగ్య శ్రీ పాత్రలు ఒకేలా ఉండబోతున్నాయి. ఐతే మహానటి కథ వేరే ఆ సినిమా వేరు.. కానీ కాంత సినిమా మాత్రం దర్శకుడు, హీరో మధ్య నలిగిపోయే కాంత కథతో వస్తుంది.
కాంత టీజర్ ఎన్నో డౌట్లు..
కాంత సినిమాలో మన దగ్గుబాటి హీరో రానా కూడా ఉన్నాడు. రానా ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాంత టీజర్ ఎన్నో డౌట్లు రేజ్ అయ్యేలా చేసింది. మరి సినిమా వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తుందా అన్నది చూడాలి. సడెన్ గా టీజర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా నిలిచింది కాంత. పీరియాడికల్ కథ అవ్వడం.. కాస్త కూస్తో సినిమాలో సినిమా హీరోయిన్ పాత్ర అవ్వడం వల్ల కీర్తి సురేష్, భాగ్య శ్రీ పాత్రల మధ్య పోలిక ఉంటుందని అనుకుంటున్నారు. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న కాంత సినిమా త్వరలో ఈ చిక్కుముడులకు సమాధానం ఇస్తుంది.
మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ చేసింది. రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా పూర్తి చేసింది. కాంతతో భాగ్య శ్రీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తుందని చెప్పొచ్చు.
