Begin typing your search above and press return to search.

నెల తిరగకుండానే ఓటీటీలోకి డ్యూడ్.. ఎక్కడ చూడొచ్చంటే?

అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి నెల తిరగకుండానే వచ్చేస్తోంది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ డ్యూడ్.

By:  Madhu Reddy   |   2 Nov 2025 9:44 PM IST
నెల తిరగకుండానే ఓటీటీలోకి డ్యూడ్.. ఎక్కడ చూడొచ్చంటే?
X

కొన్ని కొన్ని చిత్రాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లతో చేసుకునే ఒప్పందం ప్రకారం స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని చిత్రాలు నెల తిరగకుండానే ఓటీటీ లోకి వస్తే.. మరికొన్ని చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తాయి. ఇంకొన్ని చిత్రాలకు ఓటీటీ డీల్ కుదరక ఏడాది గడిచినా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావని చెప్పాలి. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి నెల తిరగకుండానే వచ్చేస్తోంది యూత్ ఫుల్ ఎంటర్టైనర్ డ్యూడ్.

ప్రముఖ డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న మమిత బైజు హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై సందడి చేసింది.

ఇటు 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ కెరియర్లో 100 కోట్ల క్లబ్లో చేరిన మూడవ చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రియులను అలరించడానికి నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ తక్కువ థియేటర్ విండో పద్ధతిని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఏ సినిమాలైనా సరే విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటిటి ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ కి వస్తాయి. ఇప్పుడు డ్యూడ్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే రెండు రోజులు ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం.

నవంబర్ 14 శుక్రవారం నుండి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతోంది. అయితే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇకపోతే నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుండడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో సినిమా చూడలేకపోయినా వారికి ఓటిటి లోకి రావడం ఒక శుభవార్త అయినా.. మరొకవైపు థియేటర్ రన్ ను ఇది ప్రభావితం చేస్తుందని.. మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా కలెక్షన్లు కూడా తగ్గే ప్రమాదం ఉందని సమాచారం. మరి దీనిపై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

డ్యూడ్ సినిమా విషయానికి వస్తే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్, నేహా శెట్టి , రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 9న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా..అక్టోబర్ 17న తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదలైంది.