డ్యూడ్ కి ఆర్యతో లింక్ ఏంటి..?
ముఖ్యంగా సినిమాలో ప్రదీప్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను అల్లు అర్జున్ ఆర్య సినిమాతో లింక్ పెడుతూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
By: Ramesh Boddu | 19 Oct 2025 10:55 AM ISTదీపావళికి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి అలరించడానికి వచ్చిన సినిమా డ్యూడ్. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు కథానాయికగా నటించింది. సినిమాను నూతన దర్శకుడు కీర్తీశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ఆల్రెడీ ప్రదీప్ చేసిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు సక్సెస్ అవ్వడంతో యూత్ అంతా కూడా డ్యూడ్ మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. సినిమా కూడా కొంతవరకు వారి అంచనాలకు రీచ్ అయ్యింది.
అల్లు అర్జున్ ఆర్య, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్..
ముఖ్యంగా సినిమాలో ప్రదీప్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను అల్లు అర్జున్ ఆర్య సినిమాతో లింక్ పెడుతూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అదేంటి అల్లు అర్జున్ ఆర్యకు, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ కి ఏంటి సంబంధం అంటే సినిమా చూసిన వాళ్లకు అర్ధమవుతుంది. అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ కీర్తీశ్వరన్ ఈ కథను ఆర్య సినిమా చూసే రాసుకున్నాడట.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా తనకు చాలా ఇష్టమై చెప్పాడు కీర్తీశ్వరన్. ఆ సినిమా స్పూర్తితోనే డ్యూడ్ కథ రాసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు చెన్నైలో పుట్టి పెరిగిన తన లైఫ్ ని జూబ్లీ హిల్స్ మార్చేసింది అంటూ డ్యూడ్ ఈవెంట్ లో కూడా చెప్పాడు కీర్తీశ్వరన్.
ప్రదీప్ తో పాటు ప్రేమలు మమితా యాడ్ అవ్వడంతో..
ప్రదీప్ తో ఈ సినిమా చేయాలని కీర్తీశ్వరన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. కానీ ప్రదీప్ కి ఈ కథ రొటీన్ అవుతుందని అనుకున్నాడట. కానీ కీర్తీశ్వరన్ పట్టుబట్టి ఈ కథ వినిపించడం.. ఆ తర్వాత మైత్రి వాళ్లు జాయిన్ అయ్యి ప్రొడ్యూస్ చేయడంతో సినిమా తెరకెక్కింది. సినిమాలో ప్రదీప్ తో పాటు ప్రేమలు మమితా యాడ్ అవ్వడంతో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది.
వరుస యూత్ సినిమాలతో ప్రదీప్ తనకంటూ ఆడియన్స్ లో ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకుంటున్నాడు. తమిళ హీరోనే అయినా ప్రదీప్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. లవ్ టుడే, డ్రాగన్ తరహాలోనే డ్యూడ్ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆర్య సినిమా స్పూర్తి అంటూ తెలుగు ఆడియన్స్ ని టచ్ చేశాడు కీర్తీశ్వరన్. సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఆర్య. ఫీల్ మై లవ్ అంటూ అప్పట్లో సుక్కు చేసిన హంగామా మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే ఇప్పటికీ కొన్ని సినిమాలకు అది స్పూర్తిగా నిలుస్తుంది. ప్రదీప్ డ్యూడ్ కూడా ఇప్పుడు యూత్ ఆడియన్స్ కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పొచ్చు.
