Begin typing your search above and press return to search.

అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు ఉస్తాద్.. సేమ్ సీన్?

అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు ఉస్తాద్.. మ్యూజిక్‌ విషయంలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   4 March 2026 4:45 PM IST
అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు ఉస్తాద్.. సేమ్ సీన్?
X

అప్పుడు పుష్ప 2.. ఇప్పుడు ఉస్తాద్.. మ్యూజిక్‌ విషయంలో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌ గా మారింది. ఒక స్టార్ సినిమాకు ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం కొత్తేం కాదు. కానీ వరుసగా అలాంటి మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలేం జరిగిందంటే?

ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ విషయంలో ఇదే పరిస్థితి కనిపించింది. ఆ చిత్రానికి మొదటి నుంచి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, చివరి దశలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను తీసుకున్నట్లు టాక్ వినిపించింది. టైమ్ లిమిట్, భారీ యాక్షన్ ఎలివేషన్స్ కారణంగా రీరికార్డింగ్‌ ను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది.

అయితే క్లైమాక్స్ సహా కీలక భాగాలకు డీఎస్పీనే పని చేశారని కూడా సమాచారం బయటకు వచ్చింది. అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశమైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ పవర్ స్టార్ సినిమాకు రిపీట్ అవుతుందనే ప్రచారం తాజాగా మొదలైంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి తొలుత డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌ గా ప్రకటించారు.

పాటల పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. కానీ తాజాగా సినిమాలోని మాస్ సీన్లు, ఎలివేషన్లు, యాక్షన్ బ్లాక్స్‌ కు అదిరిపోయే బీజీఎం కోసం తమన్ రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన గత సినిమాలకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి రిజల్ట్స్ అందించింది. ముఖ్యంగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు గాను ఆయన వర్క్ సూపర్ మూడ్ క్రియేట్ చేసింది. అందుకే ఉస్తాద్ సినిమాకు అదే ఎనర్జీ రావాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్.

అదే సమయంలో ఉస్తాద్ భగత్ సాంగ్ ముందు హరీష్ శంకర్.. పవన్ కు ఇచ్చిన హిట్ గబ్బర్ సింగ్ మూవీ అందరికీ గుర్తుకొస్తోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ విషయంలో కూడా కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ వాయిదా పడడంతో ఖాళీ అయిన స్లాట్‌ ను ఉస్తాద్ భగత్ సింగ్ వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది.

ముందుగా అనుకున్న తేదీకి బదులుగా త్వరగా రిలీజ్ చేయాలనే ఆలోచనతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేశారు. అందులో భాగంగానే బీజీఎం పనులను ఫాస్ట్ ట్రాక్‌ లో పూర్తి చేయడానికి తమన్ ఎంట్రీ ఇచ్చాడని సమాచారం. మొత్తానికి పాటలు డీఎస్పీ, బీజీఎం తమన్.. ఇలా డబుల్ మ్యూజిక్ స్ట్రాటజీ మేకర్స్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కమర్షియల్ మాస్ సినిమాల్లో మ్యూజిక్ కీలకం కావడంతో రిస్క్ తీసుకోవడం కన్నా ఇద్దరి టాలెంట్‌ ను వాడుకోవాలనే ప్లాన్ మేకర్స్ ది అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం డీఎస్పీ విషయంలోనే ఎందుకు ఇలా అని క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి అసలు విషయమేమిటో మేకర్స్ కే తెలియాలి.