మూడో సీక్వెల్ బిజినెస్ బ్లాస్ట్.. కానీ..?
అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 160 కోట్ల దాకా ఈ డీల్ జరిగిందని టాక్. సో దృశ్యం సీరీస్ లలో ఇదే హైయ్యెస్ట్ బిజినెస్ చేసింది.
By: Ramesh Boddu | 29 Nov 2025 6:00 PM ISTమలయాళ మేకర్ జీతూ జోసెఫ్ చేసే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మోహన్ లాల్ తో ఆయన చేసే సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వడమే కాదు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాయి. అందుకే ఆ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. దృశ్యం సీరీస్ లతో జీతూ జోసెఫ్, మోహన్ లాల్ చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కథ, కథనం, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా ప్రతి కథలో జీతూ జోసెఫ్ ఎక్కడ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా వస్తున్నాడు. దృశ్యం 1, 2 సినిమాలు సక్సెస్ అవగా దృశ్యం 3 సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది.
భారీ రేటుకి దృశ్యం 3 రైట్స్..
ఈ సినిమా విషయంలో జీతూ జోసెఫ్ ప్లాన్ భారీగా ఉంది. ఒకేసారి మలయాళంతో పాటు తెలుగు, హిందీ సినిమాలను కూడా షూట్ చేయాలని అనుకోగా అది కుదరక కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే మొదలు పెట్టారు. ఐతే బిజినెస్ విషయంలో మాత్రం దృశ్యం 3 మలయాళ, హిందీ రైట్స్ కలిపి ఒక డిస్టిబ్యూషన్ సంస్థ భారీ రేటుకి కొనేసింది. ఎలాగు దృశ్యం సీరీస్ లకు ఉన్న డిమాండ్ తెలుసు కాబట్టి పనోరమ సంస్థ భారీ ధరకే ఈ సినిమా థియేట్రికల్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందట.
అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 160 కోట్ల దాకా ఈ డీల్ జరిగిందని టాక్. సో దృశ్యం సీరీస్ లలో ఇదే హైయ్యెస్ట్ బిజినెస్ చేసింది. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఆడియన్స్ ని అసలు డిజప్పాయింట్ చేయదు. ముఖ్యంగా దృశ్యం లాంటి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
దృశ్యం 3 చివర్లో పార్ట్ 4 లీడ్..
దృశ్యం 3 కథ లీడ్ హీరో అతని ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ భాగం ఉంటుందట. ఐతే ఈ సీరీస్ ని పార్ట్ 2 తోనే ముగిస్తాడని అనుకోగా పార్ట్ 3 అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు జీతూ జోసెఫ్. ఐతే దృశ్యం 3 చివర్లో అయినా కథకు ముగింపు ఇస్తాడా లేదా పార్ట్ 4 లీడ్ ని వదిలేస్తారా అన్న సస్పెన్స్ కూడా ఉంది. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ చేసే అవకాశం ఉన్నా కూడా ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తుండటం వల్ల మలయాళ, హిందీ సినిమాలతో పాటు తెలుగు వెర్షన్ కుదరట్లేదు.
ఐతే మూడు భాషల్లో పార్ట్ 3 ఒకేసారి రిలీజ్ అవ్వాలనుకున్న జీతూ జోసెఫ్ ప్రయత్నాలు విఫలమయ్యేలా ఉన్నాయి. ఇంతకీ దృశ్యం 3 తెలుగు వెర్షన్ డైరెక్షన్ ఎవరు చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రం, వెంకటేష్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక దృశ్యం 3 గురించి వెంకటేష్ ఆలోచిస్తాడని తెలుస్తుంది.
