Begin typing your search above and press return to search.

దృశ్యం-3 సంగతేంటి? అసలు వెంకీ ప్లాన్ ఏంటి?

దృశ్యం-3.. ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో రూపొందిన తొలి రెండు భాగాలు దృశ్యం-1, దృశ్యం-2 సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   18 Jan 2026 9:06 PM IST
దృశ్యం-3 సంగతేంటి? అసలు వెంకీ ప్లాన్ ఏంటి?
X

దృశ్యం-3.. ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్ లో రూపొందిన తొలి రెండు భాగాలు దృశ్యం-1, దృశ్యం-2 సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో మూడో పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు, అభిమానులు. అదే సమయంలో ఇప్పుడు ఆ సినిమా కోసం సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

నిజానికి.. మలయాళంలో మోహన్‌ లాల్ చేసిన దృశ్యం సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. హిందీలో అజయ్ దేవగణ్, తమిళంలో కమల్ హాసన్ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్స్ అయింది. ఆ తర్వాత దృశ్యం సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా మలయాళంతోపాటు అన్ని భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు దృశ్యం 3.. మాలీవుడ్, బాలీవుడ్ వెర్షన్లు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

వేసవి కానుకగా ఏప్రిల్ 2వ తేదీన మలయాళం వెర్షన్ రిలీజ్ అవ్వనుంది. ఆ తర్వాత హిందీ దృశ్యం 3 మూవీ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. కానీ తెలుగు వెర్షన్ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో తెలుగు దృశ్యం 3 మూవీ సంగతేంటి.. అసలేం జరుగుతోంది అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు, వెంకటేష్ అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం వెంకటేష్ తన లైనప్ లో దృశ్యం-3 ఉందని ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2027 సంక్రాంతికి ఆ మూవీతో రానున్నారట.

అందుకే దృశ్యం-3 మరెప్పుడు చేస్తారన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. వెంకీ.. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాలు పూర్తి చేసే లోపు బాలీవుడ్, మాలీవుడ్ వెర్షన్లు రిలీజ్ అయిపోతాయి. అంతే కాదు ఓటీటీల్లో కూడా వచ్చేస్తాయి. అప్పుడు తెలుగు వెర్షన్ పై కాస్త ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అందుకే దృశ్యం-3 మూవీ విషయంలో వెంకటేష్ ప్లాన్ ఏంటోనని ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే దృశ్యం మొదటి రెండు భాగాల షూటింగ్స్ త్వరగానే కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు దృశ్యం-3 కూడా అంతే. అందుకే తన లైనప్ లో ఉన్న మిగతా సినిమాల మధ్యలో దృశ్యం-3 పూర్తి చేసే స్కోప్ ఉంది. కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే తెలుగు దృశ్యం 3 వెర్షన్.. ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఇంకెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనేది వేచి చూడాలి.