Begin typing your search above and press return to search.

'దృశ్యం-3' ఆ రెండు చోట్లా డౌటేనా?

పాన్ ఇండియాలో `దృశ్యం` ప్రాంచైజీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది.

By:  Srikanth Kontham   |   4 Nov 2025 2:00 AM IST
దృశ్యం-3 ఆ రెండు చోట్లా డౌటేనా?
X

పాన్ ఇండియాలో `దృశ్యం` ప్రాంచైజీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. రెండు భాగాల‌కు మూడు భాష‌ల్లో అనూహ్యామైన రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో `దృశ్యం 3`పై పాన్ ఇండియాలో అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌ళ్లీ మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో `దృశ్యం 3` తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఇప్ప‌టికే మాలీవుడ్ లో పార్ట్ 3ని ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ప‌ట్టాలెక్కించాడు. మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌ర వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపు కుంటుంది.

హిందీ, తెలుగులోనూ తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇంత వ‌ర‌కూ ఈ రెండు భాష‌ల్లో `దృశ్యం 3` మొద‌ల‌వ్వ‌లేదు. వెంక‌టేష్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉన్నారు త‌ప్ప వాళ్ల నోట `దృశ్యం 3` అనే మాట రాలేదు. జీతూజోసెఫ్ కూడా దీనికి సంబంధించి మ‌ళ్లీ కొత్త‌గా ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో తెలుగు, హిందీలో `దృశ్యం 3` ఉందా? లేదా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. తొలుత మూడు భాష‌ల్లోనూ ఒకేసారి చిత్రాన్ని మొద‌లు పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జీతూ జోసెఫ్ మాతృక‌లో తెరకెక్కిస్తే తెలుగు, హిందీ భాష‌ల్లో వేర్వేరు ద‌ర్శ‌కులు మొద‌లు పెడ‌తార‌ని వార్త‌లొచ్చాయి.

`దృశ్యం` ప్రాంచైజీ ఇత‌ర భాష‌ల్లోకి అలాగే వ‌చ్చింది. అయితే `దృశ్యం 2` తెలుగు వెర్ష‌న్ మాత్రం జీతూ జోసెఫ్ తెర క్కించడంతో? పార్ట్ 3కి తానే బాద్య‌త‌లు తీసుకుంటాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ మాలీవుడ్ లో మొద‌లు పెట్ట‌డంతో ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ద‌ర్శ‌కుడికి ఆ ఛాన్స్ ఇచ్చిన‌ట్లు అయింది. కానీ ప్రాజెక్ట్ ఎంత‌కీ మొదలు కాక‌పోవ‌డం..వెంకీ కొత్త సినిమాల‌కు క‌మిట్ అవ్వ‌డంతో? ఉండదు అన్న ప్ర‌చారానికి బ‌లం చేకూరుతుంది. హిందీలో కూడా `దృశ్యం` రెండు భాగాల‌ను వేర్వేరు డైరెక్ట‌ర్లే డీల్ చేసారు. దీంతో మూడ‌వ భాగం విష‌యంలో డైరెక్ట‌ర్ దొర‌క‌లేదా? లేక అజ‌య్ దేవ‌గ‌ణ్ ఆస‌క్తిగా లేడా? అన్న సందేహాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

అటు జీతూ జోసెఫ్ కూడా సైలెంట్ గా ఉండ‌టంతో మాలీవుడ్ లో తెర‌కెక్కిస్తోన్న `దృశం 3`నే పాన్ ఇండియాలో రిలీజ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారా? అన్న ప్ర‌చారం ఊపందుకుంది. ఆ క‌థ‌కు, సినిమాకు ప్రాణం పోసింది ఆయ‌నే కావ‌డంతో? పాన్ ఇండియాలో మూడ‌వ భాగాన్ని మాలీవుడ్ నుంచి రిలీజ్ చేసి స‌త్తా చాటే ఆలోచ‌న‌లో ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.