Begin typing your search above and press return to search.

ముర్ము బయోపిక్‌ ను ఎలా ప్లాన్ చేస్తున్నారో.. అసలు ఛాలెంజ్ అక్కడే..

దేశ రాష్ట్రపతి లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆ వ్యక్తి ప్రస్తుతం దేశంలో అతి పెద్ద పదవిలో కొనసాగుతుంటే.. మరింత జాగ్రత్త అవసరం.

By:  M Prashanth   |   21 Jun 2026 9:13 AM IST
ముర్ము బయోపిక్‌ ను ఎలా ప్లాన్ చేస్తున్నారో.. అసలు ఛాలెంజ్ అక్కడే..
X

దేశ రాష్ట్రపతి లైఫ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఆ వ్యక్తి ప్రస్తుతం దేశంలో అతి పెద్ద పదవిలో కొనసాగుతుంటే.. మరింత జాగ్రత్త అవసరం. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లైఫ్ పై అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఇప్పుడు ఆసక్తితో పాటు కొన్ని కీలక ప్రశ్నలను రైజ్ చేసింది.

సాధారణ బయోపిక్‌ లకు, రాష్ట్రపతి బయోపిక్‌ కు చాలా తేడా ఉంటుంది. రాజకీయ నాయకుల పదవుల నుంచి తప్పుకున్న తర్వాత వారి జీవితాలపై సినిమాలు వస్తే కొంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి జీవితాన్ని చూపించాలంటే ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. ఒకవైపు ఆమె విజయాలు చూపించాలి.. మరోవైపు అది పొలిటికల్ ప్రోపగాండాలా కనిపించకూడదు.

ద్రౌపది ముర్ము ప్రయాణంలో పొలిటికల్ ఎలిమెంట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌ గా, చివరకు రాష్ట్రపతిగా ఎదిగిన జర్నీని పక్కన పెట్టలేరు. అయితే ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, వాటిని చూపించే సమయంలో ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే విమర్శలు రాకుండా దర్శక బృందం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ పాత్రను చూపించినప్పుడు ప్రతిపక్షాలను తక్కువ చేసినట్లు కనిపించకూడదు.

అదే సమయంలో రాజకీయ వివాదాల్లోకి వెళ్లకుండా కథను పర్సనల్ లైఫ్ చుట్టూ నడపడం కీలకం. అందుకే ఆ డాక్యుమెంటరీలో పాలిటిక్స్ కంటే పర్సనాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక గిరిజన మహిళగా ఆమె ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, విద్య కోసం చేసిన పోరాటం, పర్సనల్ ట్రాజెడీలను ఎదుర్కొన్న తీరుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టవచ్చని టాక్ వినిపిస్తోంది.

మరో ముఖ్యమైన అంశం ఒరిజినాలిటీ. రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి చెప్పే ప్రతి సమాచారం కచ్చితంగా క్లియర్ గా ఉండాలి. ఎలాంటి యాడింగ్ సీన్స్, వివాదాస్పద డైలాగ్స్ లేదా రాజకీయ అర్థాలు వచ్చే డైలాగ్స్ ఉంటే వెంటనే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పాత రికార్డులు, అధికారిక సమాచారం, కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్న వాళ్ల అనుభవాల ఆధారంగా కథను రాసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన అంశాలు, అధికారిక వ్యవహారాలు, రాజ్యాంగ హోదాకు సంబంధించిన సీన్స్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్త అవసరం. దేశ అత్యున్నత పదవికి సంబంధించిన గౌరవం ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది. అందుకే ఆ ప్రాజెక్టులో సంచలనాల కంటే స్టోరీకి ప్రాధాన్యం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

అయితే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కు గతంలో సోషల్ ఎలిమెంట్స్ ను హుందాగా ప్రజెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అదే అనుభవాన్ని ఇప్పుడు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ మాత్రమే కాదు.. దేశ రాష్ట్రపతి జర్నీ. అందుకే ముర్ము బయోపిక్‌ లో అసలు ఛాలెంజ్ కథ చెప్పడంలో కాదు.. ఎవరినీ నొప్పించకుండా, పొలిటికల్ కలర్స్ అద్దకుండా, ఆమె ఇన్స్పిరేషన్ జర్నీ ఎఫెక్టివ్ గా చూపించడంలో ఉంది. అదే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ ను డిసైడ్ చేసే మెయిన్ ఎలిమెంట్ గా మారనుంది.