నీల్, తారక్.. కొత్తగా అనిపించాలంటే..
మరి డ్రాగన్ లో కూడా అదే కనిపిస్తుందా లేక దానికి మించి ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
By: M Prashanth | 12 Sept 2026 5:00 AM ISTస్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ముందే కొన్ని అంచనాలు ఉంటాయి. హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది? ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? యాక్షన్ ఎలా ఉండబోతోంది? హీరోను ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు? ఇలా సినిమా విడుదలకు ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. అయితే ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ విషయంలో మాత్రం ఆ అంచనాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తన సినిమాల్లో హీరోలను చాలా స్పెషల్ గా ప్రజెంట్ చేశారు. హీరో క్యారెక్టర్ చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసి, ఆ రోల్ మెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం ఆయన స్టైల్‌గా కనిపిస్తుంది. అందుకే నీల్ తో సినిమా అంటే భారీ ఎలివేషన్స్, పవర్ ఫుల్ హీరో అన్నది ఒక అంచనాగా మారిపోయింది. మరి డ్రాగన్ లో కూడా అదే కనిపిస్తుందా లేక దానికి మించి ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఇక్కడే ఎన్టీఆర్ తో కాంబినేషన్ ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఇప్పటి వరకు తారక్ ను ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో రకాల పాత్రల్లో చూశారు. మాస్ హీరోగా, ఎమోషనల్ హీరోగా, యాక్షన్ హీరోగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఒక దర్శకుడు తన టేకింగ్ తో ఒక స్టార్ ను మరోలా చూపించినప్పుడు ఆ కాంబో స్పెషల్ గా మారుతుంది. డ్రాగన్ లో కూడా అదే జరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
అంటే ఇది కేవలం నీల్ స్టైల్ లో ఎన్టీఆర్ కనిపించే సినిమా మాత్రమే కాకపోవచ్చు. తారక్ లో ఇంతవరకు ప్రేక్షకులు గమనించని మరో యాంగిల్ ను బయటకు తీసే ప్రయత్నం కావచ్చనే ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, ఎలివేషన్ సీన్ల విషయంలో నీల్ తన మార్క్‌ను ఎలా యూజ్ చేయబోతున్నారనేది మెయిన్. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.
నీల్ సినిమాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఏర్పడిపోయింది. అందుకే ఆయన ఏం చేసినా అది కొత్తగా అనిపించాలంటే గత సినిమాల ఎఫెక్ట్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. డ్రాగన్ లో అదే సవాలుగా మారొచ్చు. ప్రేక్షకులు నీల్ నుంచి ఏం ఆశిస్తున్నారో ఆయనకు తెలుసు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ ను మళ్లీ కొత్తగా చూపించాల్సిన అవసరం కూడా ఉంది.
అందుకే డ్రాగన్ పై ఇంట్రెస్ట్ కేవలం ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ వల్ల మాత్రమే కాదు. ఆ ఇద్దరి స్టైల్ కలిసిన తర్వాత స్క్రీన్ పై ఎలాంటి హీరోను చూపించబోతున్నారనేదే అసలు మ్యాటర్. నీల్ సినిమాకు ఉన్న గుర్తింపు ఒక రేంజ్ లో ఉంటే.. ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ మరో రేంజ్ లో ఉంది. మరి ఆ రెండు కలిస్తే వచ్చే అవుట్ పుట్ ప్రేక్షకులు ఇప్పటికే ఊహించినట్లు ఉంటుందా? లేక ఇప్పటివరకు చూడని ఎన్టీఆర్ ను చూపించే సినిమాగా డ్రాగన్ నిలుస్తుందా? అన్నది వేచి చూడాలి.
