Begin typing your search above and press return to search.

ఓటీటీ డీల్.. థియేటర్లో 1000 కోట్లు కొట్టేలా తారక్ ప్లాన్!

ఒకవేళ సినిమా తేడా కొడితే అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలో దింపుతున్నారు. ఇది సినిమా ఫలితాన్ని శాసిస్తుంది.

By:  M Prashanth   |   16 Oct 2025 10:00 PM IST
ఓటీటీ డీల్.. థియేటర్లో 1000 కోట్లు కొట్టేలా తారక్ ప్లాన్!
X

ఇటీవల కాలంలో ఓటీటీ మార్కెట్ డౌన్ అయ్యిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఓటీటీ రిలీజ్ ల వల్ల మేకర్స్ కు డబ్బులు ఎంతో కొంత వస్తున్నా.. ఇది థియేట్రికల్ రన్ పైన ప్రభావం చూపిస్తుంది. ఓటీటీలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. గతంలోలాగా సినిమాలు 50 రోజులు, 100 రోజులు థియేటర్లలో ఆడడం లేదు. కేవలం 4 వారాల థియేట్రికల్ పీరియడ్ తోనే ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఒకవేళ సినిమా తేడా కొడితే అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలో దింపుతున్నారు. ఇది సినిమా ఫలితాన్ని శాసిస్తుంది. ఓటీటీలు లేని రోజుల్లో వేరేలా ఉండేది. సినిమా కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. నాలుగు వారాల దాకా డీసెంట్ ఆక్యుపెన్సీతోనే రన్ అయ్యేది. తద్వార అంతో ఇంతో వసూళ్లు కూడా పెరిగేవి. కలెక్షన్లు పెరిగితే థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నాలుగు రూపాయిలైన సంపాదిస్తారు.

కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఆదాయం కోసం థియేట్రికల్ లాంగ్ రన్‌ పణంగా పెడుతున్నారు. 6 వారాల నిబంధన ఉన్నా రెవెన్యూకు ఆశపడి, చాలా మంది నిర్మాతలు సినిమా విడుదలైన 28 రోజులకే ఓటీటీ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇది బాక్సాఫీస్ కలెక్షన్లపై చూపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ డ్రాగన్ మేకర్స్ ఓటీటీ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా వ్యవహరించారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్నందున ఇది థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే సినిమా విడుదలైన 8 వారాలు పూర్తైయ్యే దాకా ఇది ఓటీటీలోకి రాదు. సాధారణంగా ఈ రూల్ బాలీవుడ్ లోనే ఉంది. ఇక డ్రాగన్ విషయంలో ఎలా ఉంటుంది అనుకుంటున్న తరుణంలో వాళ్ళు కూడా అదే రూట్లో వెళుతున్నట్లు తెలుస్తోంది. తమిళ్, తెలుగు వెర్షన్లకు కూడా ఈ రూలే వర్తిస్తుంది. ఈ నిబంధనతో సినిమా థియేట్రికల్ రన్, కలెక్షన్లు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

రిలీజ్ అయ్యాక సినిమాకు గుడ్ మౌత్ టాక్ వస్తే థియేటర్లలో లాంగ్ రన్ అయ్యే ఛాన్స్ ఉండడం పక్కా. గతంలో కల్కి 2898 ఏడి, పుష్ప 2 సినిమాలు లాంగ్ రన్ లో థియేటర్లలో ఆడాయి. ఈ సినిమాలు లాంగ్ రన్ లో రూ.1000 కోట్లపై చిలుకు వసూళ్లు సాధించాయి. ఈ సినిమా విషయంలోనూ మేకర్స్ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. RRR తరువాత దేవర సినిమాతో ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయిన తారక్ ఈసారి డ్రాగన్ తో 1000 కోట్లు అందుకోవాలని ఫీక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన చేశారు.