నీల్ డార్క్ వరల్డ్ మరో అవతార్ మానియా కాదుగా?
ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. `కేజీఎఫ్` నుంచి ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 22 Dec 2025 2:51 PM ISTఏదైనా మితంగా తింటే అహారం.. అమితంగా తింటే విషంగా మారుతుందన్నది జగమెరిగిన సత్యం. ఇదే తరహాలో చేసిందే మళ్లీ మళ్లీ చేసినా.. చూపించిందే మళ్లీ మళ్లీ చూపించినా చూసే వాడిని చిరాకు పుట్టుకొస్తుంది. దానికున్న విలువ పడిపోతుంది. ఫలితంగా దాని క్రేజ్ జీరో అవుతుంది. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితిని వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ `అవతార్` సీక్వెల్స్ ఎదుర్కొంటున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2009లో విడుదలైన `అవతార్` ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. వీఎఫ్ ఎక్స్ ఆధారిత సినిమాల్లో బెంచ్ మార్క్‌ని సెట్ చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఆ తరువాత దీన్ని ఫ్రాంచైజీగా మార్చి బ్యాక్ టు బ్యాక్ సిక్వెస్‌ల్స్ ని ప్లాన్ చేశాడు కెమెరూన్. ఇందులో భాగంగా విడుదలైన సీక్వెల్ `ది వే ఆఫ్ వాటర్` ఆ మ్యాజిక్‌ని పూర్తి స్థాయిలో రిపీట్ చేయలేకపోయింది.
అవతార్ 2.923 బిలియన్‌లని వసూలు చేస్తే `అవతార్: వే ఆఫ్ వాటర్` 2. 343 బిలియన్‌లు మాత్రమే రాబట్టి రేసులో వెనకబడింది. ఇక ఇదే కోవలో రీసెంట్‌గా విడుదలైన థర్డ్ పార్ట్ `అవతార్: ఫైర్ అండ్ యాష్` బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ పడుతూ మేకర్స్‌ని, ట్రేడ్ వర్గాలని షాక్‌కు గురి చేస్తోంది. 400 ప్లస్ బిలియన్‌ల బడ్జెట్‌తో నిర్మిస్తే ఇప్పటి వరకు బడ్జెట్‌నే రాబట్టలేక పోవడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ సీక్వెల్ ఫలితాన్ని దృష్టిలోపెట్టుకుని 4, 5 సీక్వెల్స్ ఆలోచనని జేమ్స్ కెమెరూన్ విరమించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. `కేజీఎఫ్` నుంచి ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీని తరువాత చేసిన `సలార్` కూడా అదే డార్క్ వరల్డ్ థీమ్‌తో సాగింది. ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ `డ్రాగన్`కు కూడా ప్రశాంత్ నీల్ ఇదే ఫార్ములాతో చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. 1969 టైమ్ పీరియడ్‌లో చైనా, భూటాన్ బోర్డర్‌లో జరిగే కథగా దీన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, మలయాళ హీరో తోవినో థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా కన్నడ సెన్సేషన్ రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఎన్టీఆర్ ఈ మూవీ లుక్ కోసం భారీగా బరువు తగ్గ షాకింగ్ మేకోవర్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అయిన ఈ మూవీని 2026 మిడ్ లో కానీ 2027 ప్రరంభంలో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ బ్లాక్ థీమ్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్‌కి కొత్త టెన్షన్ పట్టుకుంది. అవతార్ సీక్వెల్స్‌ని ఆడియన్స్ బోర్‌గా ఫీలవుతున్నట్టే బ్లాక్ థీమ్‌పై కూడా మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ సినిమా మాయలో పడి చేసిన `వార్ 2` బాక్సాఫీస్ వద్ద ఫ్లప్ కావడంతో నీల్ ప్రాజెక్ట్ విషయంలో మరింతగా కంగారుపడుతున్నారట. మరి ప్రశాంత్ నీల్ ఈ గండాన్ని దాటి ఎన్టీఆర్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని అందరి అనుమానల్ని పటాపంచలు చేస్తాడా? అన్నది తెలియాలంటే డ్రాగన్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
