ఎన్టీఆర్-రుక్మిణి నైట్ షెడ్యూల్.. ఎమోషన్స్ కోసం నీల్ సరికొత్త ప్రయోగం!
అయితే ప్రశాంత్ నీల్ తన మార్క్ సిగ్నేచర్ స్టైల్ అయిన `డార్క్ టోన్` (చీకటి నేపథ్యం) ని ఈ చిత్రంలోనూ అస్సలు విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న నైట్ షెడ్యూల్‌లో డార్క్ సీన్లను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
By: Sivaji Kontham | 17 July 2026 11:13 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ `డ్రాగన్`. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఒక భారీ నైట్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఎన్టీఆర్- రుక్మిణి వసంత్ జంటపై ఈ నైట్ షెడ్యూల్‌లో కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన మార్క్ సిగ్నేచర్ స్టైల్ అయిన `డార్క్ టోన్` (చీకటి నేపథ్యం) ని ఈ చిత్రంలోనూ అస్సలు విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న నైట్ షెడ్యూల్‌లో డార్క్ సీన్లను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
సాధారణంగా ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్ సినిమాలు వాటిలోని డార్క్ టోన్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా విస్త్రతంగా చర్చల్లో నిలిచాయి. ఆయా సినిమాల్లో తీవ్రమైన రక్తపాతం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ విజువల్ థీమ్‌ను ఉపయోగించి మెప్పించారు. అయితే ఇప్పుడు `డ్రాగన్` సినిమాలో కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం కాకుండా.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లకు కూడా నీల్ తనదైన శైలిలో డార్క్ థీమ్‌ను, చీకటిని అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం హీరో ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి మధ్య వచ్చే అత్యంత బలమైన ఎమోషనల్ సీన్స్‌ని ఈ డార్క్ షేడ్స్‌లోనే తెరకెక్కిస్తుండటం విశేషం.
ఈ రకమైన డార్క్ టోన్ - డార్క్ కథలలో పాత్రల మధ్య ఇంటెన్సిటీని దర్శకులు మరింత ప్రభావవంతంగా పెంచగలరా? అనే ప్రశ్నకు నీల్ సినిమాలే సమాధానం. నిజానికి డార్క్ నెస్ లేదా నీడతో కూడిన విజువల్స్ స్క్రీన్ పై ఉన్న పాత్రల అంతర్గత సంఘర్షణను, బాధను .. పాత్రలలోని గాంభీర్యాన్ని ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి. ప్రశాంత్ నీల్ ఎంచుకునే కథల్లో పాత్రలు ఎప్పుడూ ఒక రకమైన క్రూరమైన, కఠినమైన ప్రపంచంలో బతుకుతుంటాయి. అలాంటి వాతావరణంలో పాత్రల మధ్య ఉండే ఇంటెన్సిటీని, ఎమోషనల్ డెప్త్‌ని ఎలివేట్ చేయడానికి ఈ డార్క్ థీమ్ ఒక పవర్‌ఫుల్ టూల్‌గా ఉపయోగపడుతుంది.
ప్రశాంత్ నీల్ ఈ విధమైన డార్క్ థీమ్డ్ కథలను ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆయన సృష్టించే కథా ప్రపంచం ఎప్పుడూ నైతికతకు, చట్టానికి దూరంగా ఉండే ఒక ఊహాజనిత సామ్రాజ్యంలా ఉంటుంది. అక్కడ జీవించే పాత్రల మైండ్‌సెట్, వారిలోని ప్రతీకారేచ్ఛ, పట్టుదలను చూపించాలంటే సహజమైన వెలుతురు కంటే ఈ డార్క్ అండ్ టోన్ అత్యంత పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అందుకే నీల్ తన ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన విజువల్ లాంగ్వేజ్‌ను క్రియేట్ చేయడానికి ఈ కలర్ ప్యాలెట్‌ను నమ్ముకుంటారు. ఇది సినిమాకు ఒక ఇంటెన్సివ్ లో-కీ లుక్‌ని ఇస్తూ ప్రేక్షకుడిని కథలోకి పూర్తిగా లాగేసుకుంటుంది.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్ కెరీర్‌కు ఈ పాత్ర చాలా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన నటిస్తూ, ప్రశాంత్ నీల్ మార్క్ ఎమోషనల్ డ్రామాలో భాగం కావడం వల్ల రుక్మిణి నటనకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా... పవర్‌ఫుల్ ఎమోషన్స్ పండించే స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడం వల్ల ఈ సినిమా రుక్మిణి కెరీర్‌కి బాగా కలిసిరానుంది. మొత్తానికి నీల్ మార్క్ డార్క్ విజువల్స్ .. ఎన్టీఆర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కలిసి `డ్రాగన్`ని మరో లెవల్ కి చేరుస్తాయని అంచనాలేర్పడుతున్నాయి. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఊహిస్తున్నారు.
