ఎన్టీఆర్ కోసం నీల్ ఫస్ట్ టైమ్ ఇలా...!
ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమాల్లో ఇదొక యాక్షన్ ఎపిక్ అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టొవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 6 Jan 2026 12:00 AM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'డ్రాగన్'. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమాల్లో ఇదొక యాక్షన్ ఎపిక్ అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టొవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదొక ఎపిక్ యాక్షన్ సాగా. సున్నితమైన భావోద్వేగాలకు రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలని జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంత వరకు చేయని, ఊహించని పవర్‌ఫుల్ పాత్రలో బీస్ట్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక స్టోరీ నేపథ్యం 1969లో చైనా, భూటాన్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ సరిహద్దుగా పిలిచే ప్రాంతం చుట్టూ సాగుతుందని ఇన్ సైడ్ టాక్. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ల ఫస్ట్ కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. దానిపై మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటుందని, ఇది ప్రత్యేకమైన స్క్రిప్ట్ అని, ఇంత వరకు ఇండియన్ సినిమాల్లో చూడని యునిక్ స్టోరీ అని, దీనికి ఆకాశమే హద్దు అన్నారు. అంతే కాకుండా ఈ మూవీ ఎలా ఉంటుందన్నది మీ ఊహకు కూడా అందదని, అంచనాలకు మించి ఉంటుందని హైప్ ఇచ్చారు. దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
కొంత విరామం తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ కోసం ఫస్ట్ టైమ్ భారీ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో సెట్‌ని నిర్మించి అందులో షూటింగ్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో భారీ సెట్‌లని నిర్మించడం అనేది చాలా అరుదు. కేజీఎఫ్ నుంచి సలార్ వరకు ఎలాంటి సెట్‌లు వాడకుండా రియల్ లొకేషన్‌లలోనే షూటింగ్ చేశారు. కానీ ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సెట్ వేయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా నిర్మించిన భారీ సెట్‌లో నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట.
ఇందులో ఎన్టీఆర్‌పై పలు కీలక ఘట్టాలని షూట్ చేస్తారని ఇన్ సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సెట్ వేయడమే ఫస్ట్ టైమ్ అంటే అది కూడా తెలుగు స్టేట్‌లోని హైదరాబాద్‌లో వేయడం తొలి సారని చెబుతున్నారు. రుక్మిణీ వాసంత్ తో పాటు కయదు లోహర్ కూడా మరో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని, పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో అనిల్ కపూర్, మలయాళ స్టార్ టొవినో థామస్ నటిస్తున్నారని, ఎన్టీఆర్‌పై షూట్ చేసే యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
