పర్ఫెక్షన్ కోసం వెనుకడుగేసిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ ప్రస్తుతం అనూహ్యంగా వార్తల్లో నిలిచింది.
By: Sravani Lakshmi Srungarapu | 7 April 2026 11:00 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ డ్రాగన్ ప్రస్తుతం అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. ఈ నెలలో ప్రారంభం కావాల్సిన కీలక షూటింగ్ షెడ్యూల్ అకస్మాత్తుగా నిలిచిపోవడంతో, సినిమా రిలీజ్ పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
లుక్ తో అసంతృప్తి
అయితే ఈ బ్రేక్ వెనుక ఉన్న కారణం ఏదో నార్మల్ రీజన్ కాదు. సినిమా కోసం రెడీ చేసిన కొత్త లుక్ విషయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో షూట్‌ను ఆపాలని డిసైడ్ అయ్యారట. పర్ఫెక్షన్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, లేటైనా సరే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మే లో కొత్త షెడ్యూల్
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పలు వేరియేషన్లలో కనిపించనున్నారని తెలుస్తోంది. మల్టిపుల్ లుక్స్‌తో పాటు కొత్త గెటప్స్‌పై ప్రయోగాలు జరుగుతుండటంతో, ఆయన కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన పాత్రగా నిలవొచ్చనే అంచనాలను పెంచుతోంది. అభిమానులు కూడా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ స్కేల్ పరంగా కూడా డ్రాగన్ ఓ భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇప్పటికే జోర్డాన్‌లో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్, ఇటీవల శంషాబాద్ సమీపంలోని ఆలయంలో వారం రోజులపాటు షూటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం నగర అవుట్‌స్కర్ట్స్‌లో భారీ సెట్ నిర్మాణం జరుగుతుండగా, అక్కడి నుంచే వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ పాన్- ఇండియా స్థాయిలో విజువల్ గ్రాండియర్‌గా నిలవబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డ్రాగన్ విషయంలో తారక్ పై భారీ ఒత్తిడి
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో వచ్చిన వార్త2 తర్వాత ఎన్టీఆర్‌కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. వార్2 తో ఆశించిన స్థాయి విజయం దక్కకపోవడంతో, డ్రాగన్ ద్వారా ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఒత్తిడి కూడా అతనిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ పై అభిమానుల అంచనాలు కూడా భారీగా పెరిగాయి. సోషల్ మీడియాలో ఈ డిలే అంశంపై మిక్స్డ్ రియాక్షన్ కనిపిస్తోంది. కొంతమంది అభిమానులు ఇంకెంత లేట్? అంటూ అసహనం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం మంచి అవుట్‌పుట్ కోసం సమయం తీసుకోవడం సరైన నిర్ణయమేనని టీమ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
మొత్తానికి, డ్రాగన్ టీమ్ తీసుకున్న ఈ డెసిషన్ రిస్క్‌తో కూడుకున్నదే. ఒకవైపు డిలే వల్ల మార్కెట్‌లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరోవైపు పర్ఫెక్ట్ అవుట్‌పుట్ సాధిస్తే అది భారీ రివార్డ్‌గా మారే అవకాశం ఉంది. కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్, క్లియర్ విజన్‌తో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా తారక్ లైఫ్ లో గేమ్ ఛేంజర్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
