ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజన్ లో పెట్టిన ఎన్టీఆర్..?
ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 7 Nov 2025 3:00 PM ISTప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ నటించడం సినిమాకు మరో హైలెట్ అయ్యేలా ఉంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రుక్మిణి హడావిడి కనిపిస్తుంది. కాంతారా చాప్టర్ 1 లో ఆమె లుక్స్ అదిరిపోయాయి. అందుకే డ్రాగన్ కి అమ్మడు కలిసి వచ్చే అంశం అయ్యేలా ఉంది.
ఎన్టీఆర్ ఈ రెండు పార్ట్ లను ఒకేసారి..
ఇక డ్రాగన్ సినిమాను రెండు భాగాలుగా చేస్తారనే టాక్ ఉంది. ఎన్టీఆర్ ఈ రెండు పార్ట్ లను ఒకేసారి ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరు చాలా పెద్ద స్కెచ్ తోనే వస్తున్నారట. డ్రాగన్ రెండు భాగాలు చాలా తక్కువ టైంలోనే రిలీజ్ చేసేలా చూస్తున్నారట. ఐతే డ్రాగన్ 2 కోసం తొందరపడుతున్న తారక్ దేవర 2 ని మర్చిపోయాడా ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 1 అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోయినా ఓకే అనిపించుకుంది. ఐతే ఇప్పుడు డ్రాగన్ 2 అంటున్నారు.. మరి దేవర 2 పరిస్థితి ఏంటంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐతే డ్రాగన్ మొదటి రెండు పార్ట్ లకు సంబందించి ఒకేసారి పని పూర్తి చేస్తున్నాడట ఎన్టీఆర్. కేవలం పార్ట్ 1 రిలీజై సూపర్ హిట్ అయితే అదే వేడి మీద ఏమాత్రం లేట్ చేయకుండా డ్రాగన్ 2 వదులుతారట.
డ్రాగన్ 2 తర్వాతే దేవర 2..
ఐతే దేవర 2 ని డ్రాగన్ 2 తర్వాతే చేసేలా తారక్ ప్లానింగ్ ఉందట. ఈలోగా కొరటాల శివ సినిమాకు సంబందించిన అన్ని పనులను పూర్తి చేసేలా చూస్తున్నారట. దేవర 2 తో ఎలాగైనా ఈసారి ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా చేయాలని కొరటాల శివ ఫోకస్ చేస్తున్నారట. డ్రాగన్ 2 వచ్చిన తర్వాత వెంటనే దేవర 2 కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లి అది కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దేవర 2, డ్రాగన్ 2 ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ అందిస్తాయని అంటున్నారు. మరి ఈ ప్లానింగ్ లో ఏది ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
ప్రశాంత్ నీల్ డ్రాగన్ మాత్రం సలార్ 1 ని మించి ఉండేలా చూస్తున్నారట. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఛరిష్మాని పర్ఫెక్ట్ గా వాడుకునేలా డైరెక్టర్ ప్లానింగ్ ఉందట. ఈ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ లు షేక్ అవుతాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
