Begin typing your search above and press return to search.

డా.రాజ‌శేఖ‌ర్‌కు ఆ ప్లేస్‌ల‌పై క్లారిటీ ఇచ్చార‌ట‌!

శ‌ర్వానంద్ క‌థ‌నాయ‌కుడిగా న‌టించిన మోట‌ర్ క్రాస్ రైడింగ్ మూవీ `బైక‌ర్‌`. అభిలాష్ రెడ్డి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మ‌య్యారు.

By:  Ravindar Gorantla   |   9 April 2026 5:00 AM IST
డా.రాజ‌శేఖ‌ర్‌కు ఆ ప్లేస్‌ల‌పై క్లారిటీ ఇచ్చార‌ట‌!
X

శ‌ర్వానంద్ క‌థ‌నాయ‌కుడిగా న‌టించిన మోట‌ర్ క్రాస్ రైడింగ్ మూవీ `బైక‌ర్‌`. అభిలాష్ రెడ్డి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మ‌య్యారు. మాళ‌విక నాయ‌ర్ క‌థ‌నాయిక‌. ఈ చిత్రంలో డా. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం తెలిసిందే.ఏప్రిల్ 3న విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఇందులో డా. రాజ‌శేఖ‌ర్ హీరో శ‌ర్వాకు తండ్రిగా బుల్లెట్ సునీల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి ఆక‌ట్టుకుంటున్నారు. ఇది ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి ప్రోత్స‌హాన్ని అందించింద‌నే కామెంట్‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఆ నేప‌థ్యంలో డా. రాజ‌శేఖ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉన్న నెంబ‌ర్ 1, నెంబ‌ర్ టు గేమ్‌పై ఆస‌క్తికరంగా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. పాపుల‌ర్ యాంక‌ర్ `బైక‌ర్‌` రిలీజ్ సంద‌ర్భంగా డా. రాజ‌శేఖ‌ర్‌, ద‌ర్శ‌కుడు అభిలాష్‌రెడ్డి, హీరోయిన్ మాళిక నాయ‌ర్‌తో పాటు చిత్ర బృందంతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. సినిమా చూశాక‌ మాకు కూడా మీ లాంటి కోచ్ లైఫ్‌లో ఉంటే బాగుంటుంద‌నిపించింది. మ‌ద‌ర్ అండ్ ఫాద‌రే మ‌న ఫ‌స్ట్ గురువులు. కాక‌పోతే వేరే వేరే ప్రొఫెష‌న్స్‌లోకి వెళ్లిపోయిన‌ప్పుడు మ‌న‌కు వేరే గురువులు అయిపోతుంటారు.

కానీ మీ ఇంట్లో మాత్రం మీ అమ్మాయికు మీరే కోచ్ అని సుమ ప్ర‌శ్నించ‌డంతో డా. రాజ‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. `నేను వాళ్ల‌కు కోచ్ కాదు మాఇద్ద‌రు అమ్మాయిలు, జీవిత నాకు కోచ్‌లు` అన్నారు. అంటే ఈ సినిమా చేసేప్పుడు చేద్దామా? వ‌ద్దా? అని చ‌ర్చించాం. ఆ స‌మ‌యంలో మా అమ్మాయిలు ఇద్ద‌రూ, జీవిత ఇది మీరు చెయ్యాలి అన్నారు. లేదు శ‌ర్వా గారి సినిమాలో చేయ‌డం మ‌న గ్రేడ్ త‌గ్గించిన‌ట్టుగా అవుతుందా? అని సందేహాన్ని వ్య‌క్తం చేశాను.

అదంతా ఇప్పుడు ఏం లేద‌ని డాడీ, ఫ‌స్ట్ పొజీష‌న్‌, సెకండ్ పొజీష‌న్ అదంతా మీ టైమ్‌లో ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఎవ‌రు స‌క్సెస్‌లో ఉంటే వాళ్లే విష‌యం ఉన్న వాళ్లు అని చెప్పారు. కాబ‌ట్టి మీరు ఇలాంటి రోల్స్ చేయాల్సిందేన‌ని మా ఇద్ద‌రు అమ్మాయిలు, జీవిత అన్నారు. వాళ్లు చెప్పింది విని స‌రే అని ఈ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణ‌యం ఈ రోజు ఇలా స‌క్సెస్ కావ‌డం ఆనందంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చారు.

శివానీ, శివాత్మిక‌, జీవిత‌..ఈ ముగ్గురూ డా. రాజ‌శేఖ‌ర్‌ని ఫోర్స్ చేసి వాస్త‌వం ఎలా ఉంద‌న్న‌ది చెప్పారు కాబ‌ట్టే ఆయ‌న `బైక‌ర్‌`తో సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీ‌కారం చుట్టారు. ఈ సినిమా ఫ‌లింతంతో మ‌రింత మంది డైరెక్ట‌ర్లు డా. రాజ‌శేఖ‌ర్ కోసం క్యారెక్ట‌ర్లు క్రియేట్ చేసే అవ‌కాశం ఏర్ప‌డింది. కొత్త కొత్త పాత్ర‌ల‌ని, క‌థ‌ల‌ని డాజ‌రాజ‌శేఖ‌ర్‌ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్లు, రైట‌ర్లు సిద్ధం చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చే ఆవ‌కాశం ఉంది. `బైక‌ర్‌` ఫ‌లితంతో శ్రీ‌హ‌రి లోటుని తీరుస్తూ రాజ‌శేఖ‌ర్ మ‌రిన్ని సినిమాల్లో క‌థ‌కు కీల‌కంగా నిలిచే ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తార‌ని అంతా ఆశిస్తున్నారు.