Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ వ‌దిలేసిందే మంచిదైందా?

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు మ‌ళ్లీ స‌రికొత్త ఉత్సాహాన్ని అందించిన సినిమా `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`.

By:  Ravindar Gorantla   |   26 March 2026 4:00 AM IST
రాజ‌శేఖ‌ర్ వ‌దిలేసిందే మంచిదైందా?
X

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు మ‌ళ్లీ స‌రికొత్త ఉత్సాహాన్ని అందించిన సినిమా `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏస్థాయి విజ‌యాన్ని 2013, జ‌న‌వ‌రి 11న సంక్రాంతి సందర్భంగా విడుద‌లైన ఈ మూవీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో ఎవ‌ర్ గ్రీన్ మూవీగా నిలిచింది. ఇందులో స్టార్ హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, మ‌హేష్ బాబు తొలిసారి క‌లిసి న‌టించారు. స‌మంత‌, అంజ‌లి హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీలో పెద్దోడు - చిన్నోడుగా వెంక‌టేష్ - మ‌హేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

`పూల కుండిని ఎందుకు త‌న్నావురా` డైలాగ్ ఇప్ప‌టికీ నెట్టింట ఏదో ఒక సంద‌ర్భంలో ట్రెండ్ అవుతూనే ఉంది. అన్న‌ద‌మ్ములుగా వెంక‌టేష్‌, మహేష్‌ల నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు అభిమానుల్ని విశేషంగా అల‌రించాయి. వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్ల త‌ర‌హాలోనే ప్ర‌కాష్ రాజ్ పోషించిన రేలింగి మావ‌య్య క్యారెక్ట‌ర్ కూడా బాగా పాపుల‌ర్ అయింది. ఏం జ‌రిగినా అంతా మ‌న మంచికే అన్న‌ట్టుగా పాజిటివ్ వేలో సాగే రేలంగి మావ‌య్య క్యారెక్ట‌ర్ కోసం ముందు మేక‌ర్స్ డా. రాజ‌శేఖ‌ర్‌ని అనుకున్నార‌ట‌.

అంటే వెంక‌టేష్‌, మ‌హేష్ బాబుల‌కు ఫాద‌ర్‌గా అన్న‌మాట‌. అయితే ఈ క్యారెక్ట్‌ని రాజ‌శేఖ‌ర్ అనివార్య కార‌ణాల వ‌ల్ల చేయ‌లేక‌పోయార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. ``సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` సినిమాలో ఎప్పుడూ న‌వ్వుతూ ఉండే క్యారెక్ట‌ర్ కోసం మేక‌ర్స్ న‌న్ను సంప్ర‌దించారు. నా న‌వ్వు బాగుంటుంద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తూ..ఆ రోల్ నేను చేస్తే బాగుంటుంద‌ని అడిగారు. కానీ చేయ‌లేక‌పోయా` అని తెలిపారు.

అయితే ఆ క్యారెక్ట‌ర్ చేయ‌లేక‌పోయినందుకు ఎప్పుడైరా ఫీలయ్యారా? అని అడిగితే అలాంటిది ఏమీ లేద‌ని చెప్పడం గ‌మ‌నార్హం. ఒక వేళ డా. రాజ‌శేఖ‌ర్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`లోని రేలింగి మావ‌య్య క్యారెక్ట‌ర్ చేసి ఉంటే ఆయ‌న కెరీర్ ఇప్ప‌టిలా ఉండేది కాద‌ని, మ‌రోలా ఉండేద‌ని, ఆయ‌న ఆ క్యారెక్ట‌ర్ వ‌దిలేయ‌డ‌మే మంచిదైంద‌ని కొంత మంది అంటున్నారు. ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ల‌కు ఫాద‌ర్ అంటే కెరీర్ మ‌రీ అనుకున్న విధంగా ఉండేది కాద‌ని, అంతా ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ల‌కు అడిగే వార‌ని చెబుతున్నారు.

ఆ రోజు ఆ క్యారెక్ట‌ర్‌ని వ‌దిలేసుకున్నారు కాబ‌ట్టే ఇప్పుడు త‌న‌కు త‌గ్గ క్యారెక్ట‌ర్‌ని `బైక‌ర్‌`లో చేశార‌ని, ఇది ఆయ‌న కెరీర్‌కు మ‌రింత జోష్‌ని అందించ‌డ‌మే కాకుండా కెరీర్‌ని మ‌రో ట‌ర్న్ తీసుకునేలా చేస్తుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. `బైక‌ర్‌`లో శ‌ర్వానంద్ హీరోగా న‌టించ‌గా అత‌నికి కోచ్‌గా, తండ్రిగా డా. రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించారు. బుల్లెట్ సునీల్ క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందో టీజ‌ర్‌లో చూపించ‌డం, రాజ‌శేఖ‌ర్‌, శ‌ర్వా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌టంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్నా `బైక‌ర్‌` మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం ఖాయం అని అంతా అంటున్నారు. అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఏప్రిల్ 3న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.