'దోస్తానా 2' నుంచి జాన్వీని తొలగించారా?
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించిన `దోస్తానా` ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
By: Sivaji Kontham | 27 Sept 2025 9:00 AM ISTకరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించిన `దోస్తానా` ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. స్వలింగ సంపర్కుల బోల్డ్ ప్రేమకథతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఫన్, రొమాన్స్ ప్రతిదీ హైలైట్ గా నిలిచాయి. ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ లాంటి స్టార్లు ప్రతి ఫ్రేమ్ లో రక్తి కట్టించే నటప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
అందుకే ఈ ఫ్రాంఛైజీలో రెండో సినిమాని తెరకెక్కించేందుకు ధర్మ ప్రొడక్షన్స్ చాలా ఆసక్తిని కనబరిచింది. అయితే `దోస్తానా 2` కోసం కార్తీక్ ఆర్యన్ లాంటి జెన్ జెడ్ స్టార్ ని ఎంపిక చేసుకున్నా కానీ, ఎందుకనో కార్తీక్ తో ధర్మాధినేత కరణ్ జోహార్ కి సెట్ కాలేదు. ఆ ఇద్దరి మధ్యా విభేధాలు తలెత్తడంతో ఆ ప్రాజెక్ట్ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత కూడా ఆగిపోయింది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ తో మళ్లీ పని చేసేది లేదని చెప్పిన కరణ్ జోహార్ కొన్నేళ్ల తర్వాత ఇప్పటికి పూర్తిగా మారాడు. కార్తీక్ ఆర్యన్ లాంటి ట్యాలెంటెడ్ హీరోని వదులుకుంటే జరిగే నష్టం ఏమిటో అతడికి ప్రాక్టికల్ గా అర్థమయ్యాక ప్లాన్ మారింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా ధర్మ ప్రొడక్షన్స్ వరుసగా సినిమాలను నిర్మిస్తోంది.
అయితే కార్తీక్ మాత్రం `దోస్తానా 2`లో భాగం కాదు. అతడి స్థానంలో లక్ష్యను ఎంపిక చేసుకున్నట్టు ఇప్పుడు నటుడు విక్రాంత్ మాస్సే ధృవీకరించాడు. అయితే దోస్తానా 2 కోసం తొలుత ఎంపిక చేసుకున్న జాన్వీ కపూర్ ని తిరిగి ఆన్ బోర్డ్ తెస్తారా లేదా? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. ధర్మ ప్రొడక్షన్స్ ఇంకా కథానాయిక ఎవరు? అన్నది ప్రకటించలేదు. దోస్తానా లో దేశీ గాళ్ పాత్రలో ప్రియాంక చోప్రా నటన గొప్పగా ఆకర్షించింది. ఇప్పుడు జాన్వీకపూర్ లాంటి జెన్ జెడ్ స్టార్ అయితే రక్తి కడుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. కానీ కథానాయిక ఎవరు? అన్నది విక్రాంత్ మాస్సే కానీ, ధర్మ టీమ్ కానీ ధృవీకరించలేదు.
మొదటిసారి ధర్మ సంస్థలో టింగురంగడి పాత్రలో నటిస్తున్నానని మాత్రం విక్రాంత్ మాస్సే ధృవీకరించాడు. రంగు రంగుల డిజైనర్ దుస్తులు, ఫ్యాన్సీ సన్ గ్లాసెస్ ధరించి మొదటిసారి కొత్తగా కనిపిస్తానని మాత్రం అతడు చెప్పాడు. యూరప్ లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో షూటింగ్ జరుగుతుందని తెలిపాడు. ఈసారి దేశీ గాళ్ ఎవరు? అని అడిగినప్పుడు.. ఎవరైనా కావొచ్చు.. ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉండనివ్వండి అని అన్నాడు. దోస్తానా 2 కి తరుణ్ మన్సుఖాని దర్శకుడు. కరణ్ జోహార్ 2008 చిత్రం దోస్తానాకు సీక్వెల్ కథతో రూపొందుతోంది.
