Begin typing your search above and press return to search.

నిద్రపోతే చావే.. డోంట్ స్లీప్ టీజర్ లో ఈ పాయింట్ భలే ఉందే!

టాలీవుడ్ లో ఇప్పుడు రొటీన్ కథల కంటే, కాస్త మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్లకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ ట్రెండ్ ను కరెక్ట్ గా క్యాచ్ చేస్తూ వస్తున్న సరికొత్త చిత్రమే 'డోంట్ స్లీప్'.

By:  M Prashanth   |   14 Oct 2026 6:44 PM IST
నిద్రపోతే చావే.. డోంట్ స్లీప్ టీజర్ లో ఈ పాయింట్ భలే ఉందే!
X

టాలీవుడ్ లో ఇప్పుడు రొటీన్ కథల కంటే, కాస్త మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ థ్రిల్లర్లకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ ట్రెండ్ ను కరెక్ట్ గా క్యాచ్ చేస్తూ వస్తున్న సరికొత్త చిత్రమే 'డోంట్ స్లీప్'. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు లాంచ్ చేయడం ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది. దాదాపు పదిహేను మందికి పైగా సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేయడంతో సినిమాపై బజ్ పెరిగింది.




ఈ సినిమా వెనుక ఉన్న మెయిన్ కెప్టెన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన, ఇప్పుడు మెగాఫోన్ పట్టి ఈ సైకలాజికల్ విజువల్ ఎపిక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఒక సినిమాటోగ్రాఫర్ దర్శకుడిగా మారితే ఫ్రేమ్స్ ఎంత కొత్తగా ఉంటాయో ఈ టీజర్ విజువల్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడా రెగ్యులర్ థ్రిల్లర్ ఛాయలు లేకుండా ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకురావడంలో ఆయన విజన్ క్లియర్ గా కనిపిస్తోంది.

టీజర్ లో చూపించిన అసలు పాయింట్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఇందులో హీరో ఇంద్ర రామ్ కు నిద్రపోవడం అంటేనే భయం. ఎందుకంటే తను నిద్రలో కనే కలలన్నీ నిజమవుతుంటాయి. అలా కలల రూపంలో మరణం తనను వెంటాడుతూ ఉండటం, కళ్లు మూస్తే ప్రాణాలు పోతాయనే భయంతో హీరో పడే సైకలాజికల్ స్ట్రగుల్ ను టీజర్ లో చాలా క్యూరియస్ గా చూపించారు. ఒక కొత్త కుర్రాడు ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ తో పరిచయం కావడం సాహసమే.

విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాత వి. చూడామణి ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ చెబుతోంది. ఒక థ్రిల్లర్ కు కావాల్సిన మూడ్ ను క్రియేట్ చేయడంలో ఆర్ట్ వర్క్, కలర్ గ్రేడింగ్ తో పాటు సౌండ్ డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయినట్లు తెలుస్తోంది.

ఈ కథను మరింత బలంగా మార్చేందుకు దర్శకుడు మంచి క్యాస్టింగ్ ను ఎంచుకున్నారు. వెన్నెల కిషోర్, దర్శకుడు దేవకట్టా, తబా రీమా, జోయితా బెనర్జీ లాంటి వాళ్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా దేవకట్టా, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఇలాంటి సీరియస్ థ్రిల్లర్ లో ఉండటం కచ్చితంగా కథకు అదనపు బలాన్ని ఇస్తుంది. పర్ఫార్మెన్స్ ల పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందనే నమ్మకం కలుగుతోంది.

'డోంట్ స్లీప్' టీజర్ తో మేకర్స్ ఫస్ట్ స్టెప్ లోనే ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేయడంలో టీజర్ ఎలివేట్ అవుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ను ఎంచుకుని, దాన్ని విజువల్ గా అంతే స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసినట్లు అర్థమవుతోంది. అయితే టీజర్ లో చూపించిన ఈ ఇంటెన్సిటీని రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద సస్టైన్ చేయడం అంత ఈజీ కాదు. మేకర్స్ ఆ బ్యాలెన్స్ ను కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే, బాక్సాఫీస్ దగ్గర ఈ సైకలాజికల్ డ్రామా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయం.