బిరుదులతో నేనేం చేసుకుంటానంటోన్న నటుడు!
కొంత మంది సెలబ్రిటీలకు పేర్లకు ముందు బిరుదులు వేసుకోవడం నచ్చదు. వాటితో పిలుపించుకోవడానికి కూడా ఇష్టపడరు.
By: Srikanth Kontham | 25 Nov 2025 6:00 PM ISTకొంత మంది సెలబ్రిటీలకు పేర్లకు ముందు బిరుదులు వేసుకోవడం నచ్చదు. వాటితో పిలుపించుకోవడానికి కూడా ఇష్టపడరు. కోలీవుడ్ స్టార్స్ అజిత్ , విశాల్, సూర్య లాంటి స్టార్లకు ఆ కోవకు చెందిన వారే. కానీ అభిమానుల కోరిక మేరకు మాత్రం స్రీన్ పై ట్యాగ్స్ తప్పవు. అవి లేనిదే అభిమానులు ఎంత మాత్రం అంగీకరించరు. తాజాగా బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పాయ్ కి కూడా ట్యాగులంటే ఎంత మాత్రం నచ్చదనేసారు. తన పేరు ముందు తాను ఓ `స్టార్` అనే బిరుదు వేసుకోవడం నచ్చదన్నారు. తనని ఓనటుడిగా లేదా స్టార్ గా అనుకుంటారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
యువకులకు మాత్రమే కాదు:
స్టార్ అనే పదాన్ని తాను ఎంత మాత్రం తీసుకోనన్నారు. 65 ఏళ్ల వ్యక్తిగా నటించగలను. ప్రధాన పాత్రలు పోషించ గలను. ఎలాంటి పాత్ర అయినా సంకోంచం లేకుండా చేస్తాను. ఇదంతా పరిశ్రమలో ఓ సంప్రదాయంగా నమ్ము తాను. సినిమాలో లీడ్ రోల్ అంటే కేవలం యువకులది మాత్రమే కాదు. బలమైన పాత్రలో ఏ వయసు వారైనా నటించవచ్చు . పాత్రకు వయసు అడ్డు రాదన్నది మాత్రమే తాను నమ్ముతానన్నారు. కెరీర్ ఆరంభం నుంచి తాను ఇదే పంథాలో ఉన్నానన్నారు. ఎలాంటి పాత్ర పోషించినా అందులో తన నటన మాత్రమే కనిపించాలన్నారు.
అలాగైతే ఎంతో కాలం కొనసాగలేం:
తానెప్పుడు అలాగే సిద్దమై కెమెరా ముందుకెళ్తానన్నారు. `స్టార్` అనే ఇమేజ్ తో మ్యాకప్ వేసుకోనన్నారు. ఏ నటుడైనా జీరో నుంచి మొదలై హీరో అవుతాడు. తాము ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్ర ఫరిదిలో అది హీరో రోల్ తో సమానమే. లెక్కలేసుకుని పనిచేస్తే గనుక ఇండస్ట్రీలో ఎంతో కాలం కొనసాగలేము అన్నది మనోజ్ బాజ్ పాయ్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవలే ఆయన నటించిన సంచలన సిరీస్ `ప్యామిలీ మ్యాన్` నుంచి మూడవ సీజన్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి శ్రీకాంత్ తివారీగా ప్రేక్షకుల్ని అలరించారు.
నాల్గవ సీజన్ కూడా :
మూడవ భాగం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే `ఫ్యామిలీ మ్యాన్ 4` కూడా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో గత సీజన్లలో దొరకని ప్రశ్నలకు సమాధానాలన్నీ దొరుకుతాయన్నారు. మనోజ్ బాజ్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. వైవిథ్యమైన పాత్రలతో తకనంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకున్నారు. కానీ వాటన్నింటికంటే `ప్యామిలీమ్యాన్` వెబ్ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం `పోలీస్ స్టేషన్ మెయిన్ బూట్` సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల కానుంది.
