Begin typing your search above and press return to search.

నిర్మాతగా స్టార్ హీరోయిన్ మ‌రో చిత్రం!

అలియా భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రానికి `డోంట్ బి షై` అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 12:10 PM IST
నిర్మాతగా  స్టార్ హీరోయిన్ మ‌రో చిత్రం!
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిగా ఎంత బిజీగా ఉన్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ వైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప్ర‌యోగాల‌కు వెనుకాడ‌టం లేదు. మ‌ధ్య‌లో హాలీవుడ్ ఛాన్సులు వ‌స్తే వాటిని స‌ద్విని యోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంత బిజీలోనూ అమ్మ‌డు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే `ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్` బ్యానర్‌పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను నిర్మించిన అలియా తాజాగా మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలియా భట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రానికి `డోంట్ బి షై` అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. నేటి యువత ఆలోచనా విధానానికి, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో ముందుండే అలియా ఈసారి కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలు స్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుండటం విశేషం.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోవేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ..ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నటిగా అగ్రస్థానంలో కొనసాగుతూనే మహిళా నిర్మాతగా అలియా భట్ తీసుకుంటున్న నిర్ణయాలు న‌వ‌త‌రం న‌టీమ‌ణుల‌కు స్ఫూర్తిని స్తున్నాయి. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ తన ప్రొడక్షన్ హౌస్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

అలియా భ‌ట్ భర్త రణ్‌బీర్ కపూర్ కూడా నిర్మాణ పనుల్లో భార్య‌కు అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటారట.`డోంట్ బి షై` సినిమా డిజిటల్ ప్రీమియర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అలియా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం విడుదల కానుండటంతో గ్లోబల్ ఆడియన్స్‌కు ఇది మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ .. ట్రైలర్ త్వర లోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్ట‌లేదు.

నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కూ ఆ వేదిక‌పైనే ప్ర‌చారం నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా భార్య భ‌ర్త‌లు క‌లిసి నిర్వ‌హించ‌నున్నారు. అలియాభ‌ట్ ప్ర‌తీ విష‌యంలోనూ ర‌ణ‌బీర్ క‌పూర్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. అది వృత్తిగ‌తంగానైనా..వ్య‌క్తిగ‌తంగానైనా ఇరువురు ఎలాంటి దాప‌రికాలు లేకుండా ముందుకెళ్తుంటారు.