Begin typing your search above and press return to search.

‘దొంగ నా కొడుకు’ నుంచి జోష్ పెంచే ‘ఓ మై గాడ్’ సాంగ్ రిలీజ్!

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న వినూత్న చిత్రం ‘దొంగ నా కొడుకు’.

By:  Madhu Reddy   |   28 Oct 2026 4:07 PM IST
‘దొంగ నా కొడుకు’ నుంచి జోష్ పెంచే ‘ఓ మై గాడ్’ సాంగ్ రిలీజ్!
X

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న వినూత్న చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ క్రైమ్ కామెడీ సినిమాకు శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను పెంచేలా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తాజాగా ‘ఓ మై గాడ్’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం!





రామ్ మిరియాల ఎనర్జిటిక్ వాయిస్‌తో మ్యాజిక్:

సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన ‘ఓ మై గాడ్’ పాట రొమాంటిక్‌గా, జోష్ నింపేలా ఉంది. ఆకట్టుకునే మ్యూజిక్, కొత్త తరహా బీట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సింగర్ రామ్ మిరియాల తనదైన ఎనర్జీ, ప్రత్యేకమైన వాయిస్‌తో ఈ పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఆయన డైనమిక్ వోకల్స్ పాటను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

భాస్కరభట్ల చక్కటి సాహిత్యం:

ప్రేమలో పడిన హీరో తన మనసులోని ఫిలింగ్స్ భాస్కరభట్ల సాహిత్యం ద్వారా అందంగా పలికించారు. తన జీవితంలోకి ప్రేయసి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి, ఆమెతో గడిపే ప్రతి క్షణం ఎందుకు ప్రత్యేకంగా అనిపిస్తుందో ఈ పాటలో చూపించారు. ప్రేమలో కలిగే కొత్త ఉత్సాహం, అనుభూతులను ఈ పాట ఆకట్టుకునేలా రాసారు.

క్యూట్ కెమిస్ట్రీ.. అదిరిపోయే కొరియోగ్రఫీ:

ఈ పాటకు ఆట సందీప్ అందించిన కొరియోగ్రఫీ చాలా అందంగా ఉంది. హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, హీరోయిన్ సుష్మిత శెట్టితో ఆయన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో క్యూట్‌గా ఉంది. ఇక యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌తో సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

భారీ తారాగణం.. త్వరలోనే రిలీజ్:

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మూవీ ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్‌తో సినిమా ప్రమోషన్లను జోరుగా కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, క్రైమ్ కామెడీ జోనర్‌లో వస్తున్న ‘దొంగ నా కొడుకు’ సినిమా నుంచి వచ్చిన ‘ఓ మై గాడ్’ సాంగ్ ప్రేక్షకులను పూర్తి వినోదంలో ముంచెత్తుతోంది. ఇక నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.