సంచలన ప్రాంచైజీలో అంతమంది డాన్లా?
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ `డాన్` నుంచి `డాన్ 3`కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 4 Sept 2025 4:00 PM ISTబాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' నుంచి 'డాన్ 3'కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి డాన్ అవతారాన్ని రణవీర్ సింగ్ ఎత్తుతున్నాడు. పర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మరో చిత్రమిది. కొన్ని నెలలుగా ఈప్రాజెక్ట్ పైనే పర్హాన్ అండ్ కోపని చేస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే `డాన్` కు జోడీగా కియారా అద్వాణి ని ఎంపిక చేసారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా? కియారా కావాలని పట్టు పట్టు మరీ పర్హాన్ ఆమెని ఎంపిక చేసాడు. గ
థర్డ్ పార్ట్ కోసం ఓల్డ్ డాన్స్ :
ఇదే ప్రాజెక్ట్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా భాగమవు తుందని ప్రచారంలో ఉంది. ఇంకా మరికొంత మంది గాళ్స్ సైతం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 'డాన్ 3' ని మరింత స్పెషల్ గా మార్చే ప్లాన్ చేస్తున్నాడు పర్హాన్. దీనిలో భాగంగా గత డాన్ చిత్రాల్లో నటించిన సిసలైన డాన్ లు కూడా రంగంలోకి దించతున్నాడు. ఇప్పటికే `డాన్ 2`లో నటించిన షారుక్ ఖాన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపిస్తుంది. షారుక్ కూడా పాత్ర నచ్చడం సహా పర్హాన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు:
తాజాగా ఇదే రేసులో బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ కూడా నిలిచారు. ఆయన కూడా థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ లో భాగమవుతున్నారు అన్న వార్త బాలీవుడ్ ని కుదిపేస్తోంది. 1978 లో రిలీజ్ అయిన డాన్ లో మొదటి హీరో అమితాబ్ అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంచైజీ ఆయనతోనే మొదలైంది. డాన్ పాత్రలో అప్పట్లోనే అమితాబ్ ఓ రేంజ్ లో అలరించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధించింది. 7 మిలి యన్స్ తో నిర్మించిన చిత్రం 70 మిలియన్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఆరోజుల్లోనే.
అనంతరం ఆకాశాన్నంటేలా:
ఆ తర్వాత 2011లో షారుక్ ఖాన్ హీరోగా పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 'డాన్ 2' రిలీజ్ అయింది. ఇదీ సంచలనమే. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత 'డాన్ 3' కి రంగం సిద్ద మైంది. ఈ నేపథ్యంలో థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే భారీ కాన్వాస్ పైనే చిత్రాన్ని ప్లాన్ చేయడం అంతకంతకు అంచనాలు పెంచేస్తోంది. ఇక ప్రాజెక్ట్ మొదలైన తర్వాత అవే అంచనాలు పతాక స్థాయికి చేరతాయి.
