తలైవా 173: ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది...
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: M Prashanth | 3 Jan 2026 12:54 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి కెప్టెన్ ఎవరు అనే సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ మేకర్స్ అఫిషియల్ గా ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ మొదలైన కొత్తలో దర్శకుడు సుందర్ సి పేరు ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సుందర్ సి డ్రాప్ అయ్యాక తలైవా 173 డైరెక్టర్ సీటులో ఎవరు కూర్చుంటారు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ హల్చల్ చేశాయి.
రోజుకో పేరు తెరపైకి వచ్చింది. రజినీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ ని, కమల్ హాసన్ లాంటి క్లాసీ ప్రొడక్షన్ వేల్యూస్ ని బ్యాలెన్స్ చేయగలిగే దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు కాబట్టి ఫ్యాన్స్ కూడా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక యంగ్ డైరెక్టర్ కి ఈ భారీ బాధ్యతను అప్పగించారు. శివకార్తికేయన్ తో 'డాన్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన సిబి చక్రవర్తి ఇప్పుడు రజినీకాంత్ సినిమాను డీల్ చేయబోతున్నాడు.
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో సిబి చక్రవర్తి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ ఛాయిస్ నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకవైపు లెజెండరీ యాక్టర్స్, మరోవైపు ఎక్స్ పీరియన్స్ తక్కువ ఉన్న యంగ్ డైరెక్టర్. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. అయితే సిబి చక్రవర్తి టేకింగ్ మీద, ఆయన నెరేషన్ మీద నమ్మకంతోనే కమల్, రజినీ ఈ బిగ్గెస్ట్ ఛాన్స్ ఇచ్చి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్. ఆయన మ్యూజిక్ ఉంటే చాలు సినిమాపై హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బస్టర్స్ ఇస్తున్న అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించడం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయం. పోస్టర్ లో కత్తెర్లతో డిజైన్ చేసిన స్టార్ సింబల్, 'ఎవ్రీ ఫ్యామిలీ హ్యాజ్ ఏ హీరో' అనే క్యాప్షన్ చూస్తుంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది.
ప్రస్తుతానికి డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది కానీ సినిమా రిలీజ్ కి మాత్రం చాలా టైమ్ ఉంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ లో అనౌన్స్ చేశారు. త్వరలోనే మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా బయటకు రానున్నాయి. మొత్తానికి రజినీ, కమల్, సిబి చక్రవర్తి కాంబో సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
