కలిసి పనిచేద్దామన్నా ఇప్పుడు వద్దంటున్నారా?
'డాన్ -3' విషయంలో నలుగుతోన్న వివాదం తెలిసిందే. రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం..అపై అతడిపై బ్యాన్ విధించడం అంతా పాత ఎపిసోడ్.
By: Srikanth Kontham | 31 May 2026 6:00 PM IST`డాన్ -3` విషయంలో? నలుగుతోన్న వివాదం తెలిసిందే. రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం..అపై అతడిపై బ్యాన్ విధించడం అంతా పాత ఎపిసోడ్. తాజాగా ఈ వ్యవహారంపై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. చిత్ర నిర్మాణానికి సంబంధించిన స్క్రిప్ట్, పాత్రల రూపకల్పన ..మేకింగ్ శైలి విషయంలో రణవీర్ సింగ్‌కు -అఖ్తర్ సోదర-సోదరీమణులకు (ఫర్హాన్, జోయా) మధ్య కొన్ని కీలకమైన విభేదాలు తలెత్తినట్లు బాలీవుడ్ మీడియాలో కథనా లొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి గందరగోళం మధ్య ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు సృజనాత్మక వాతా వరణాన్ని పునరుద్ధరించేందుకు రణవీర్ సింగ్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫర్హాన్ - జోయా అఖ్తర్‌లతో ఉన్న పాత వృత్తిపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వివాదాన్ని పరిష్క రించుకోవడానికి ఓ ప్రత్యేకమైన రాజీ మార్గాన్ని ముందుకు తెచ్చినట్లు వినిపిస్తోంది. ఇరుపక్షాలూ కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గి సినిమాను సజావుగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రతిపాదన ఉద్దేశంగా లీకైంది. రణవీర్ సింగ్ పంపిన ఈ శాంతి ప్రతి పాదనను ఫర్హాన్ అక్తర్ -జోయా అక్తర్ తిరస్కరించినట్లు రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.తమ చిత్రాల మేకింగ్.. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడటానికి అక్తర్ టీమ్ సిద్ధంగా లేదని తమ సృజనాత్మక హక్కులను.. దర్శకుడి విజన్‌ను మార్చుకోవడానికి వారు నిరాకరించారని టాక్.
రణవీర్ చేసిన ప్రతిపాదనలు సినిమా అసలు ఆత్మను దెబ్బతీసేలా ఉన్నాయని భావించడం వల్లే వారు తోసిపుచ్చినట్లు సమాచారం. ఈ తాజా పరిణామం `డాన్ 3` భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టివేసింది. బాలీవుడ్ భారీ చిత్రాల వెనుక ఉండే ఇగో క్లాషెస్ - సృజనాత్మక విభేదాలు కొత్తేం కాకపోయినా? `డాన్ 3` వంటి కల్ట్ క్లాసిక్ విషయంలో ఇది మరింత తీవ్రంగా కనిపిస్తోంది. పాత తరం ఇమేజ్‌ను మోస్తూ కొత్త తరం అభిరుచులకు తగినట్లుగా సినిమాను రూపొందించే క్రమంలో ఇరుపక్షాలు పట్టుదలను వీడకపోవడం ప్రాజెక్ట్‌కు పెద్ద పరీక్షగా మారింది.
మొత్తంగా ఈ పరిణామలు చూస్తుంటే? `డాన్ 3` విషయంలో పర్హాన్ అక్తర్ కొత్త హీరోతో ముందుకెళ్లే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి. అది జరగాలన్నా? తాజా వివాదాలన్నింటికి ఓ పరిష్కారం దొరకినప్పుడే సాధ్యమవుతుంది. ప్రాజెక్ట్ నుంచి అధికారికంగా తప్పుకున్నట్లు రణవీర్ సింగ్ వెల్లడించిన నేపథ్యంలో? నిర్మాణ సంస్థకు నష్టపరిహారం చెల్లిస్తే సమస్య దాదాపు ముగిసినట్లేనని బాలీవుడ వర్గాలు భావిస్తున్నాయి.
