Begin typing your search above and press return to search.

'డాన్ 3' లోకి హృతిక్ రోషన్?

మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీ 'డాన్ 3' విష‌యంలో ఎలాంటి వివాదాలు ముసురుకున్నాయో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   6 Jun 2026 4:00 AM IST
డాన్ 3 లోకి హృతిక్ రోషన్?
X

మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీ `డాన్`3 విష‌యంలో ఎలాంటి వివాదాలు ముసురుకున్నాయో తెలిసిందే.అమితాబ‌చ్చ‌న్, షారుక్ ఖాన్ త‌ర్వాత డాన్ బాధ్య‌త‌లు ర‌ణ‌వీర్ సింగ్ కి అప్ప‌గించినా వివాదాల నేప‌థ్యంలో ఆయన‌ త‌ప్పుకోవ‌డం..అటుపై మండ‌లి చ‌ర్య‌లు...తిరిగి మ‌ళ్లీ న‌టిస్తాన‌న‌డం..అందుకు ద‌ర్శ‌కుడు ప‌ర్హాన్ అక్త‌ర్ అసంతృప్తిగా ఉండ‌టం తెలిసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రాజెక్ట్‌కు సంబంధించి సరికొత్త రూమర్ బాలీవుడ్ ట్రేడ్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రణవీర్ సింగ్ స్థానంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

హృతిక్ రోషన్ స్వయంగా పాత్రపై ఆసక్తి చూపిస్తూ దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు హింట్స్ ఇస్తున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో `ధూమ్ 2`, `వార్` వంటి చిత్రాలలో స్టైలిష్ విలనిజం -యాక్షన్‌తో మెప్పించిన హృతిక్ రోషన్‌కు `డాన్` పాత్ర అద్భుతంగా సరిపోతుందని..అన్ని విధాలుగా ఆ పాత్ర‌కు హృతిక్ అర్హుడంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫర్హాన్- హృతిక్ ల మధ్య ఉన్న పాత స్నేహం (లక్ష్య, జిందగీ నా మిలేగి దొబారా చిత్రాల అనుబంధం) కారణంగా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సరికొత్త థియరీలు వెలు గులోకి వ‌స్తున్నాయి. అలాగ‌ని ర‌ణ‌వీర్ సింగ్ ఎగ్జిట్ ఇంకా క‌న్ప‌మ్ అవ్వ‌లేదు. వివాదాల నేప‌థ్యంలో కొంత సందిగ్ద‌త నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలోనే హృతిక్ రోషన్ క్లాసిక్, స్టైలిష్ యాక్షన్ లుక్ ఫ్రాంచైజీకి మరింత అంతర్జాతీయ స్థాయిని తెస్తుందని ఒక వర్గం ప్రేక్షకులు బ‌లంగా నమ్ముతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌ణ‌వీర్ సింగ్ అభిమానుల‌కు ..హృతిక్ రోష‌న్ అభిమానుల‌కు మ‌ధ్య యుద్దం మొద‌ల‌య్యే స‌న్నివేశం క‌నిపిస్తుంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేకపోయినప్పటికీ `డాన్ 3` పాత్ర చుట్టూ ఇంటర్నెట్‌లో క్రియేట్ అవుతున్న హైప్ అటు రణవీర్ అభిమానులలో ఆందోళ‌ న‌కు తెర తీస్తోంది.

ఏదేమైనప్పటికీ ఈ విషయాలపై నిర్మాణ సంస్థ‌ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ గానీ, ఇటు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇదంతా ఇంటర్నెట్ ప్రపంచంలో నడుస్తున్న ఊహాగానాలు - నెటిజన్ల అంచనాలు మాత్రమే. కానీ డాన్ లాంటి ఐకానిక్ పాత్రపై ప్రేక్షకులలో ఏ స్థాయి అంచనాలు - ఒత్తిడి ఉన్నాయో సామాజిక మాధ్యమాల ట్రెండ్ స్పష్టం చేస్తోంది. మ‌రి తుదిగా ఎవ‌రు ఛాన్స్ అందుకుంటారో చూడాలి.