Begin typing your search above and press return to search.

ఈసారి అత‌డే రంగంలోకి దిగుతున్నాడా?

ప‌ర్హాన్ అక్త‌ర్ డాన్ 3 ప్రాజెక్ట్ ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి ర‌ణ‌వీర్ సింగ్ త‌ప్పుకోవ‌డంతో సీన్ మొత్తం మారిపోయింది

By:  Srikanth Kontham   |   2 March 2026 4:05 PM IST
ఈసారి అత‌డే రంగంలోకి దిగుతున్నాడా?
X

ప‌ర్హాన్ అక్త‌ర్ డాన్ 3 ప్రాజెక్ట్ ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి ర‌ణ‌వీర్ సింగ్ త‌ప్పుకోవ‌డంతో సీన్ మొత్తం మారిపోయింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా న‌టించ‌లేనంటూ ర‌ణ‌వీర్ ఏ ముహూర్తాన త‌ప్పుకున్నాడో? అప్ప‌టి నుంచి ప్రాజెక్ట్ పెండింగ్ లో ప‌డిపోయింది. అటుపై కియారా అద్వాణీ కూడా ఎగ్జిట్ అవ్వ‌డం స‌హా మ‌రికొంత మంది పాత్ర ధారులు ఒక్కొక‌రుగా ఎగ్జిట్ అయ్యారు. దీంతో ప‌ర్హాన్ అక్త‌ర్ హీరో పాత్ర కోసం నానా పాట్లు ప‌డుతున్నాడు. షారుక్ ఖాన్ నే తిరిగి రంగంలోకి దించాలా? హృతిక్ రోష‌న్ ని తెర‌పైకి తేవాలా? లేదా మ‌రో న‌టుడా? అంటూ తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌య్యాడు.

కానీ సినిమా మాత్రం క్యాన్సిల్ చేయ‌న‌ని త‌ప్ప‌కుండా ప‌ట్టాలెక్కించే ప్రాజెక్ట్ గా ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్ద‌మైంది. హీరో-హీరోయిన్ సెట్ అయితే ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌డ‌మే ఆల‌స్యం. ఈ నేప‌థ్యంలో ప‌ర్హాన్ అక్త‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు బాలీవుడ్ లో మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోపాత్ర‌కు వాళ్ల‌ను.. వీళ్ల‌ను బ్ర‌తిమ‌లాడుకోవ‌డం కంటే? తానే ఆ పాత్ర పోషిస్తే ప‌నైపోతుంద‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. డాన్ పాత్ర‌కు సంబంధించి అన్ని ర‌కాలుగా స‌న్న‌ధ‌మై తానే బ‌రిలోకి దిగితే? ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయోచ్చు అన్న‌ ఆలోచ‌న దిశ‌గా క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది.

అదే జ‌రిగితే? ప‌ర్హాన్ అక్త‌ర్ కి చాలా స‌మ‌యం కలిసొస్తుంది. హీరో ఎంపిక కోసమే నెల‌ల పాటు స‌మ‌యం కేటాయించాడు. ర‌ణ‌వీర్ సింగ్ ఎంపిక విష‌యంలో చాలా త‌ర్జ‌న భ‌ర్జన‌లు జ‌రిగాయి. అత‌డి లైన‌ప్ లో ఉన్న సినిమాలో పాత్ర‌ల‌న్నింటిని క్రాస్ చెక్ చేసి పాత్రల మ‌ధ్య వ్యత్యాసం లేక‌పోవ‌డంతోనే ఎంపిక జ‌రిగింది. ఇప్పుడు కొత్త న‌టుడ్ని తీసుకోవాలంటే? మ‌ళ్లీ ఈ ప‌నుల‌న్నీ ప‌ర్హాన్ చేయాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఇంకొంత స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ ఆలోచించుకునే ప‌ర్హాన్ డాన్ గా అవ‌తారం ఎత్తాల‌నుకుంటున్నాడా? అన్న సందేహాలు అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతున్నాయి. హీరోయిన్ ఎంపిక పెద్ద స‌మ‌స్యే ఏం కాదు.

ఇప్ప‌టికే ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ ల‌ను ప‌రిశీలిస్తున్నాడు. ఆ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌ర్ని తీసుకోవాల‌ని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా కూడా హిందీ సినిమాలు చేసి చాలా కాల‌మ‌వుతోంది. మాతృ భాష‌కు దూర‌మ‌వుతున్నా? అన్న బాధ పీసీ లోలోప‌ల ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌ర్హాన్ రాసిన పాత్ర న‌చ్చితే పీసీ లాక్ అవుతుంది. అమె కాక‌పోతే మిగ‌తా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని క‌న్విన్స్ చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడే ప‌ర్హాన్. ఏది ఏమైనా ఏడాది మిడ్ లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించాల‌ని ప‌ర్హాన్ బ‌లంగా ముందుకు క‌దులుతున్నాడు.