Begin typing your search above and press return to search.

హీరో బ‌రువుతో హీరోయిన్ కి చెమ‌ట‌లు!

1978లో విడుదలైన హిందీ చిత్రం `డాన్` భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయి. చంద్ర బరోట్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది.

By:  Srikanth Kontham   |   3 April 2026 9:00 PM IST
హీరో బ‌రువుతో హీరోయిన్ కి చెమ‌ట‌లు!
X

1978లో విడుదలైన హిందీ చిత్రం `డాన్` భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయి. చంద్ర బరోట్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్ప‌ట్లోనే సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డాన్ - అమాయకపు విజయ్ పాత్ర‌ల మ‌ధ్య గొప్ప వ్య‌త్యాసాన్ని పండించారు.`డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ.. నాముమ్కిన్ హై` అనే డైలాగ్ ఇప్పటికీ పాత‌ సినీ ప్రియుల నోట వినిపిస్తుంది. ఇదే సినిమాలో జీనత్ అమన్ `రోమా` పాత్ర సినిమాకు మ‌రో బ‌లంగా క‌లిసోచ్చాయి.

తాజాగా నాటి క్లాసిక్ చిత్రం గురించి సీనియర్ నటి జీనత్ అమన్ సోషల్ మీడియా వేదికగా ఓ పాత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. `సినిమాలో ఒక కీలక సన్నివేశంలో స్పృహలో లేని అమితాబ్ బచ్చన్‌ను ఆసుపత్రి నుండి వీల్ ఛైర్‌పై కూర్చోబెట్టి పోలీసుల కళ్లు గప్పి తప్పించాల్సి ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో పడ్డ కష్టాన్ని జీనత్ గుర్తు చేసుకున్నారు. `ఆ వీల్ ఛైర్ చాలా పాతది. దానికి తోడు అమితాబ్ బచ్చన్ గారి బరువును మోస్తూ ఆ ఛైర్‌ను ముందుకు నెట్టడం నాకు కత్తి మీద సాములా అనిపించింది. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టేసింది. ఆ సమయంలో శక్తినంతా ఉపయోగించి ఛైర్‌ను నెడుతున్నా.

ముఖంలో ఆ కష్టం తెలియకుండా పోకర్ ఫేస్ మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్` గా అనిపించింద‌న్నారు. అలాగే తాను పోషించిన రోమా పాత్ర గురించి మాట్లాడుతూ, ` ఆ క్యారెక్టర్‌లోని ధైర్యం, తెలివితేటలు తనకు ఎంతో ఇష్టమని జీనత్ కొనియాడారు. సెట్‌లో యూనిట్ సభ్యులందరితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా షూటింగ్ మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా సాగిందన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ హీరోగా రిలీజ్ అయిన `డాన్` రీబూట్ వెర్షన్ కూడా జీన‌త్ ఎంతో నచ్చిందన్నారు. భవిష్యత్తులో ఈ ఫ్రాంచైజీ నుండి మరిన్ని సినిమాలు రావాలని ఆకాంక్షించారు.

జీన‌త్ స్పంద‌న‌కు నెటి జ‌నులు ఫిదా అవుతున్నారు. అమితాబ్ బచ్చన్ - జీనత్ అమన్ ల కెమిస్ట్రీ ఇప్పటికీ అద్భుతమని, `జిస్కా ముఝే థా ఇంతేజార్` పాటలో వారిద్దరూ చూపించిన స్టైల్ , స్వాగ్ మరపురానివని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 1978లో రిలీజ్ అయిన ఈ చిత్రం అటుపై అనేక భాషల్లో రీమేక్ అయింది. అలాగే `డాన్` ఫ్రాంచైజీకి బలమైన పునాదిగా నిలిచింది. `డాన్ 3`కి కూడా రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.