స్టార్ హీరోల క్యామియోలు అవసరమా? అవి ఉంటే ఎలా ఉండాలి...
ఒక స్టార్ హీరో సినిమాలో మరో హీరో కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు.
By: Gopi Velupala | 24 Oct 2026 5:00 PM ISTఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు... మూవీ ఎన్ని రోజులు ఆడిందనే దానికంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందనే దాని మీదనే ఇండస్ట్రీ రికార్డులు డిపెండ్ అయి ఉన్నాయి. ఈ కలెక్షన్స్ పెంచడానికి ప్రేక్షకులకు థియేటర్ లో మైండ్ బ్లోయింగ్ హై ఇవ్వడానికి దర్శకులు ఇతర హీరోలతో క్యామియో క్యారెక్టర్లు చేయిస్తున్నారు. నిజానికి ఈ క్యామియో క్యారెక్టర్లు కొన్ని సినిమాలకు వరంలా మారితే మరికొన్నింటికి శాపంలా మారుతున్నాయి. ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి క్యామియోలు నిజంగా అవసరమా?
క్యామియో రోల్స్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతాయి...
కథలో భాగంగా సహజం గా వచ్చే క్యామియో లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ కనక రాజు దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్' మూవీలో 'రోలెక్స్' క్యారెక్టర్ లో సూర్య నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి రోలెక్స్ అనే ఒక గంభీరమైన పాత్ర ఉందనే క్యూరియాసిటిని డైరెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చి, క్లైమాక్స్ లో ఒక్కసారిగా సూర్య ను ఒక క్రూరుడిలా చూపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఆ గెటప్, మాటలు, అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. 'నెల్సన్' డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా చేసిన 'జైలర్' మూవీలో కన్నడ స్టార్ హీరో 'శివరాజ్ కుమార్', మలయాళం టాప్ హీరో 'మోహన్ లాల్' చేసిన క్యామియో క్యారెక్టర్లు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఒక స్టార్ హీరో సినిమాలో మరో హీరో కనిపించడం అనేది అప్పట్లో చాలా ఫ్రెష్ పాయింట్ దానివల్ల ఆ క్యామియో లు పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి... దానికి తోడు క్యామియో రోల్ సినిమాలో ఉందనే విషయం ప్రేక్షకుడికి తెలియదు. కాబట్టి స్క్రీన్ మీద ఆ హీరోను చూసిన ప్రేక్షకుడికి సడన్ సర్ప్రైజ్ కలగడంతో ఒక హై ఫీల్ వచ్చింది. అలాగే వాళ్లు కథలో భాగమయ్యారు కాబట్టి అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది.
క్యామియోలు వర్కౌట్ కాకపోవడానికి కారణం...
ఒక స్టార్ హీరో సినిమాలో మరో హీరో కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ మధ్య క్యామియోల పేర్లతో ఎవరో ఒక్క హీరోను స్క్రీన్ మీదకి తీసుకువస్తున్నారు. స్లో మోషన్ షాట్స్, గన్స్ పట్టుకొని కాల్చడం, గొడ్డలి తీసుకొని నరకడం, బ్లడ్ బాత్ చేయడం క్యామియో కాదు. కథ డిమాండ్ చేసినప్పుడే క్యామియో రావాలి. సినిమాలో అవసరం లేకపోయిన ప్రేక్షకుడి మెప్పు పొందాలనే ఉద్దేశ్యంతో ఇతర హీరోలను తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోతేనే బెటర్. ఎందుకంటే ఆ స్పెషల్ క్యారెక్టర్ వల్ల ఆడియన్స్ కి మూవీ చూస్తున్నప్పుడు హై ఫీల్ వచ్చిన సినిమా చూశాక ఆ హీరో ఎందుకు వచ్చాడు.
తన ఇంపార్టెన్స్ ఏం లేదు కదా ఆయన రాకపోయినా సినిమా నడిచేది కదా అనే దోరణిలో ఆలోచిస్తూ నవ్వుకుంటున్నారు. ఇతర హీరోలను పెట్టి ఆడియన్స్ మెప్పు పొందటం కంటే మంచి కథతో వచ్చి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఉత్తమం... అలాగే కొన్ని సినిమాల్లో క్యామియో లు వచ్చినప్పటికి అవి స్క్రిప్ట్ కి కట్టుబడి ఉన్న ప్రేక్షకుడిని పెద్దగా ఇంప్రెస్ చేయడం లేదు. కారణం ఏంటంటే మూవీ మేకర్స్ బిజినెస్ కోసం, ఓపెనింగ్స్ ఎక్కువ గా రావడానికి క్యామియో పాత్ర లను ముందుగానే రివీల్ చేస్తున్నారు. దానివల్ల ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది కాబట్టి దానిని సర్ప్రైజ్ లా ఫీల్ అవ్వడం లేదు. 'జైలర్ 2' మూవీ లో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు అనే విషయాన్ని మేకర్స్ ముందుగానే స్పష్టం చేశారు. అందుకే ఆ క్యామియో వర్కౌట్ అయినప్పటికి ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో సాటిస్ఫై చేయలేదనే చెప్పాలి...
లోకేష్ కనకరాజు 'విక్రమ్' మూవీ లో వర్కౌట్ అయినట్టుగా కూలీ మూవీలో దానిని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే కూలీ లో అమీర్ ఖాన్ క్యామియో రోల్ పోషించినప్పటికి పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. క్యామియో వల్ల సినిమాలు ఆడవు. కేవలం ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇవ్వడానికి మాత్రమే క్యామియో హెల్ప్ అవుతుంది. మంచి స్క్రిప్ట్ ఉంటే మూవీలో ఎవరు ఉన్న లేకపోయిన సక్సెస్ లను సాధించవచ్చు...
