Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ చేయకపోతే సినిమాలు సక్సెస్ సాధించలేవా?

అసలు ప్రమోషన్స్ వల్ల సినిమాకి ఎలాంటి హెల్ప్ జరుగుతుంది. ప్రమోషన్స్ ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

By:  Gopi Velupala   |   30 Sept 2026 11:30 AM IST
ప్రమోషన్స్ చేయకపోతే సినిమాలు సక్సెస్ సాధించలేవా?
X

ప్రేక్షకుడిని మెప్పించే కథతో వచ్చిన సినిమాలు సక్సెస్ ని సాధిస్తాయి. ఎంతో కష్టపడి తీసిన సినిమాను ప్రమోట్ చేసుకుంటేనే ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు. అందుకే ఒక సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రొడ్యూసర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. నిజానికి ప్రమోషన్స్ లేకపోతే సినిమాలు సక్సెస్ సాధించవా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అసలు ప్రమోషన్స్ వల్ల సినిమాకి ఎలాంటి హెల్ప్ జరుగుతుంది. ప్రమోషన్స్ ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...

ప్రమోషన్స్ వల్ల ఉపయోగాలేంటి?

ఒక మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాని ప్రేక్షకుడి దాకా తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ అనేవి చాలా కీలకపాత్ర వహిస్తాయి. పెద్ద సినిమాలైతే భారీ ఎత్తున ప్రేక్షకులు థియేటర్ కి రావాలని మొదటి రెండు మూడు రోజుల్లోనే భారీ ఓపెనింగ్స్ ను కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ప్రమోషన్స్ చేస్తుంటారు... అందుకే టీజర్లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటి ని రేకెత్తించి మొదటి రోజే వాళ్ళను థియేటర్ కి తీసుకురావడానికి ప్రమోషన్స్ ఉపయోగపడుతాయి.

నిజానికి ప్రమోషన్స్ లేకపోయినా కూడా కొన్ని సినిమాలు మౌత్ టాక్ తో నడుస్తాయి. కానీ ఈ పోటీ వాతావరణంలో సినిమాలు మొదటి రెండు మూడు రోజులు కలెక్షన్స్ ను తీసుకురాలేక పోతే కంటెంట్ ఎంత బాగున్నా కూడా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్లు ఆ మూవీని తీసేసి దాని ప్లేస్ లో వేరొక సినిమాను వేసే అవకాశం ఉంది. దీనివల్ల థియేటర్లలో సినిమా ఎక్కువ రోజులు ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. సినిమాను చూసి అది ఎలా ఉందో చెబుతూ మౌత్ టాక్ ను స్ప్రెడ్ చేయాలన్న కూడా కనీసం కొందరు ప్రేక్షకులైనా థియేటర్ కి వచ్చి సినిమాను చూడాలి కదా దానికోసమైన ఎంతో కొంత మూవీని ప్రమోట్ చేయాల్సిందే.

ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు

ప్రమోషన్స్ పెర్ఫెక్ట్ గా లేకపోతే సినిమా మీద బజ్ ఉండదు. దానివల్ల సినిమా వస్తుందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. జనాల్లో సినిమాకు రావాల్సినంత రీచ్ రాదు... దానివల్ల సినిమా ఎంత బాగున్నా కూడా థియేటర్లలో నడవదు ఇక ఓటీటీ లో చూడాల్సిందే...అందుకే ప్రతి సినిమా ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు అవుతుందనేది లెక్కలేసుకొని మరి అంత డబ్బును తీసి పక్కన పెట్టుకుంటున్నారు...

దీన్ని బట్టి చూస్తే కేవలం ప్రమోషన్స్ వల్లనే సినిమాలు ఆడుతున్నాయా అనే డౌట్ కొందరికి రావచ్చు. ఎన్ని ప్రమోషన్స్ చేసిన థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి సినిమా నచ్చితేనే అది హిట్ అవుతుంది నచ్చకపోతే ఎవరు ఎన్ని పబ్లిసిటి స్టంట్స్ చేసిన సినిమాను కాపాడలేరు...