17 ఏళ్లకే సూర్య కూతురు సినీ పరిశ్రమలోకి.. తల్లిదండ్రుల కన్నా ముందే!
కానీ ఇప్పుడు డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా 17 ఏళ్ల వయసులోనే.
By: M Prashanth | 27 Sept 2025 12:13 PM ISTసౌత్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ అండ్ క్యూట్ జోడీల్లో సూర్య, జ్యోతిక జంట కూడా ఒకటన్న విషయం తెలిసిందే. సినిమాల్లో కలిసి వర్క్ చేస్తూనే.. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి.. ఆపై పెళ్లి చేసుకున్నారు. 19 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారే కూతురు దియా, కొడుకు దేవ్.
అయితే ఇప్పుడు సూర్య, జ్యోతికల కూతురు దియా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. క్యూట్ గా, చక్కగా ఉందని అంతా కామెంట్లు పెట్టారు. దీంతో సూర్య కూతురు హీరోయిన్ అవుతుందేమోనని అంతా ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ ఇప్పుడు డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా 17 ఏళ్ల వయసులోనే. తన పేరెంట్స్ సూర్య.. 22 ఏళ్ల వయసులో నెరుక్కు నేర్ తో తెరంగేట్రం చేయగా.. తల్లి జ్యోతిక 19 ఏళ్లకు తొలి సినిమా డోలీ సాజా కే రఖనా చేసింది. ఇప్పుడు దియా మాత్రం 17 ఏళ్లకే తొలి షార్ట్ ఫిల్మ్ లీడింగ్ లైట్ ను రూపొందించింది.
సూర్య, జ్యోతిక సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఆ షార్ట్ ఫిల్మ్.. 13 నిమిషాల నిడివితో రూపొందింది. బాలీవుడ్ మహిళా గాఫర్ల గురించి తెరకెక్కింది. ఫిలిం సెట్స్ లో లైటింగ్ పనులు చేసే టెక్నీషియన్స్ ను గాఫర్లు అంటారు. ఆ ఫీల్డ్ లో మహిళలు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, పట్టుదల చుట్టూ దియా షార్ట్ ఫిల్మ్ సాగింది.
అయితే హెటాల్ డెడ్దియా, ప్రియాంకా సింగ్, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళా గ్రాఫర్ల జీవన ప్రయాణమే షార్ట్ ఫిల్మ్. వారు ముగ్గురూ పని భారం, శారీరక–భావోద్వేగ సమస్యలు, సమాజంలో ఉన్న అడ్డంకులను ఎలా అధిగమించారో దియా చూపించారు. ప్రస్తుతం ఆ షార్ట్ ఫిల్మ్ లాస్ ఏంజెలెస్ లోని రెజెన్సీ థియేటర్ లో ప్రదర్శితమవుతోంది.
ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్ లో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శిస్తున్నారు. దీంతో 2026 ఆస్కార్ అవార్డుల బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో దియా షార్ట్ ఫిలిం అర్హత పొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే తమ కుమార్తె ఎంట్రీపై సూర్య, జ్యోతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెబ్యూ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు.
